Telugu Global
Telangana

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి....కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ‌!

తన కార్పోరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోడీకి, విశాఖ‌ స్టీల్ ప్లాంట్ పట్ల సానుభూతి ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని, కేంద్రమే వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి విశాఖ‌ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి....కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ‌!
X

తన కార్పోరేట్ మిత్రులకు లాభం చేకూర్చడం కోసమే మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడాన్ని తక్షణం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

తన కార్పోరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోడీకి, విశాఖ‌ స్టీల్ ప్లాంట్ పట్ల సానుభూతి ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని, కేంద్రమే వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి విశాఖ‌ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలని కోరారు.

గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్ తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు.

లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అతి తక్కువ ధరకు అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి బీఆరెస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ కు కేటీఆర్ సూచించారు.

First Published:  2 April 2023 7:56 AM GMT
Next Story