Telugu Global
Telangana

బీహర్, స్థానిక కూలీల మధ్య రాళ్ల దాడి.. కారణం ఇదే..

దాదాపు అర గంట పాటు పరస్పరం రోడ్డుపై రాళ్లు రువ్వుకున్నారు. దాంతో అక్కడున్న వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికులు పరుగులు తీశారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

బీహర్, స్థానిక కూలీల మధ్య రాళ్ల దాడి.. కారణం ఇదే..
X

నల్లగొండ ప్రధాన రోడ్డుపై బీహర్‌ కూలీలకు, స్థానిక కూలీలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు నడిరోడ్డుపై పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. భాస్కర్ టాకీస్ వద్ద అడ్డా కూలీలు ఉండే ప్రదేశంలో గొడవ జరిగింది.

బీహర్‌ కూలీలు తక్కువ కూలీ తీసుకుని పనిచేస్తున్నారని... తాము తీసుకునే కూలీలో సగం కూలీకే బీహర్‌ కూలీలు వెళ్తున్నారని.. దాంతో తమను పనికి ఎవరూ పిలవడం లేదన్నది స్థానిక కూలీల వాదన. అలా సగం కూలీకే ఎందుకెళ్తున్నారని తాము ప్రశ్నించగా... రాళ్లు రువ్వారని స్థానిక కూలీలు చెబుతున్నారు. తక్కువ డబ్బులకే పని ఒప్పుకుంటున్నామన్న కోపంతో స్థానిక కూలీలే తొలుత తమపై దాడి చేశారని బీహర్‌ కూలీలు ఆరోపిస్తున్నారు.

దాదాపు అర గంట పాటు పరస్పరం రోడ్డుపై రాళ్లు రువ్వుకున్నారు. దాంతో అక్కడున్న వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికులు పరుగులు తీశారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రోడ్డు మీద పెద్దెత్తున రాళ్లు పడ్డాయి.

First Published:  2 Oct 2022 6:04 AM GMT
Next Story