Telugu Global
Telangana

మొబైల్ ఫోన్ల రికవరీలో 67.9 సక్సెస్ రేటుతో తెలంగాణ టాప్

సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా పోయిన మొబైల్ ఫోన్ల వివరాలు మాత్రమే కాకుండా.. అనేత ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్లను ఇందులో రిజిస్టర్ చేయవచ్చు.

మొబైల్ ఫోన్ల రికవరీలో 67.9 సక్సెస్ రేటుతో తెలంగాణ టాప్
X

మొబైల్ ఫోన్ ఇప్పుడు తప్పని సరి గ్యాడ్జెట్ అయిపోయింది. కేవలం ఫోన్ కాల్స్ కోసమే కాకుండా.. అనేక రకాల యాప్స్ ద్వారా బ్యాకింగ్, హెల్త్, గ్రోసరీ, ఈ-కామర్స్, ఫుడ్ ఆర్డర్, ట్రాన్స్‌పోర్టేషన్ సేవల కోసం వాడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించినప్పుడు గతంలో ఎక్కువగా పర్స్‌లు పోతుండేవి. కానీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే ఎక్కువగా చోరీకి గురవుతున్నట్లు తెలుస్తున్నది. మొబైల్ ఫోన్లను ఎక్కడో పెట్టి మర్చిపోయి రావడం. హోటల్స్, రెస్టారెంట్, పబ్‌లకు పోయినప్పుడు ఆతృతలో పారేసుకోవడం సాధారణమే. అయితే, మొబైల్ ఫోన్ పోయిందంటే.. అది తిరిగి దొరకడం గగనమనే చెప్పాలి. మొబైల్ ఫోన్లలో చాలా మంది విలువైన డేటాను కూడా నిక్షిప్తం చేస్తుండటంతో ఫోన్లు పోతే ఆందోళనకు గురవుతున్నారు. అయితే గతంలో పోలీసులు కూడా పోయిన మొబైల్ ఫోన్ ఎవరూ వాడకుండా బ్లాక్ చేయడం వరకే పరిమితం అయ్యేవారు. చాలా వరకు రివరీలు సాధ్యం కాలేదు.

దేశంలో మొబైల్ ఫోన్ల చోరీలు ఎక్కువ కావడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్‌ను తీసుకొని వచ్చింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా పోయిన మొబైల్ ఫోన్ల వివరాలు మాత్రమే కాకుండా.. అనేత ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్లను ఇందులో రిజిస్టర్ చేయవచ్చు. అన్ని రాష్ట్రాల పోలీస్‌లు సీఈఐఆర్‌ను ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది. తెలంగాణ పోలీసులు కూడా కొన్నాళ్లుగా సీఈఐఆర్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్లను సక్సెస్‌ఫుల్‌గా రికవరీ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ 67.9 శాతం రేటుతో అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణ పోలీస్ 110 రోజుల్లో 5,038 ఫోన్లను రికవరీ చేశారు. గత పదహారు రోజుల్లో ఏకంగా 1,000 ఫోన్లు రికవరీ చేయడం గమనార్హం. తెలంగాణ తర్వాత కర్ణాటక 54.2 శాతం, ఆంధ్రప్రదేశ్ 50.9 శాతం రికవరీ రేట్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మే 17న సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభించారు. అయితే తెలంగాణలో ఏప్రిల్ 19 నుంచే పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

సీఈఐఆర్ పోర్టల్ డేటా ప్రకారం ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 7 వరకు తెలంగాణ పోలీసులు 55,219 డివైజ్‌లను బ్లాక్ చేశారు. ఇక 11,297 ఫోన్లు ఎక్కడ ఉన్నాయో ట్రేస్ చేయగలిగారు. 5,038 ఫోన్లను రికవరీ చేసిన తర్వాత అన్‌బ్లాక్ చేసి ఆ ఫోన్ యజమానులకు అందజేశారు. ఇక రాజధానిలోని మూడు కమిషనరేట్ల డేటా ప్రకారం.. సైబరాబాద్‌లో 763 ఫోన్లు, హైదరాబాద్‌లో 402 ఫోన్లు, రాచకొండలో 398 ఫోన్లు రికవరీ అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో వరంగల్, నిజామాబాద్ కమిషనరేట్లు ఉన్నాయి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్‌తో తెలంగాణ పోలీసులు భాగపస్వామ్యమై సీఈఐఆర్ పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా రూపొందించారు. దీని ద్వారా పౌరులు చాలా సులభంగా తమ పోయిన మొబైల్ డీటైల్స్ నమోదు చేసే అవకాశం ఉంది. సొంతగా చేసుకోలేని వారు దగ్గరలోని మీ-సేవ లేదా పోలీస్ స్టేషన్‌లో ఈ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్స్ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

First Published:  8 Aug 2023 11:30 AM GMT
Next Story