Telugu Global
Telangana

ఎంసెట్‌ పేరు మార్పు.. 8 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌ ఇవే!

టీఎస్ ఎంసెట్‌ పేరును TS EAPCET-తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. TS EAPCETతో పాటు ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌ సహా మొత్తం ఎనిమిది ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌ ప్రకటించింది.

ఎంసెట్‌ పేరు మార్పు.. 8 ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌ ఇవే!
X

తెలంగాణలో ఎంసెట్‌ పేరును మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఎంసెట్‌ పేరును TS EAPCET-తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. TS EAPCETతో పాటు ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌ సహా మొత్తం ఎనిమిది ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌ ప్రకటించింది.

2024-25 ఎడ్యుకేషన్ ఇయర్‌లో నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ డేట్స్‌, వాటిని నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఇవే.

TS EAPCET(ఇంజినీరింగ్‌) - మే 9 -11, JNTUH

TS EAPCET(అగ్రికల్చర్‌ అండ్ ఫార్మా) - మే 12 - 13, JNTUH

తెలంగాణ ఈసెట్‌ - మే 6, ఉస్మానియా యూనివ‌ర్సిటీ

టీఎస్‌ ఎడ్‌సెట్‌ - మే 23, మహాత్మాగాంధీ యూనివర్సిటీ

టీఎస్‌ లా సెట్‌, పీజీఎల్‌సెట్‌ - జూన్ 3, ఉస్మానియా యూనివర్సిటీ

టీఎస్‌ ఐసెట్‌ - జూన్ 4 - 5, కాకతీయ యూనివర్సిటీ

♦ టీఎస్‌ పీజీఈసెట్‌ జూన్ 6 - 8, జేఎన్‌టీయూహెచ్‌

♦ టీఎస్‌ పీఈసెట్‌ - జూన్‌ 10 - 13, శాతవాహన యూనివర్సిటీ

First Published:  25 Jan 2024 4:11 PM GMT
Next Story