Telugu Global
Telangana

తెలంగాణలో సోనియాగాంధీ పర్యటన..?

సోనియాగాంధీ వ‌స్తే పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించి.. కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించారు.

తెలంగాణలో సోనియాగాంధీ పర్యటన..?
X

తెలంగాణలో సోనియాగాంధీ పర్యటన..?

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌.. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. ఇప్పటికే భారీ బహిరంగ సభలతో ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ సైతం బహిరంగ సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌ నింపుతున్నారు.

సెప్టెంబర్‌లో తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభకు సోనియాగాంధీ హాజరైన విషయం తెలిసిందే. కాగా, సోనియాగాంధీని మరోసారి రాష్ట్రానికి రప్పించేలా కాంగ్రెస్‌ నేతలు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్‌ 28న తెలంగాణలో ప్రచారం ముగుస్తుండగా.. అంతకుముందు రోజు నిర్వహించే బహిరంగ సభకు సోనియాగాంధీ హాజరవుతారని తెలుస్తోంది. కరీంనగర్‌ లేదా వరంగల్‌ లేదా హైదరాబాద్‌లో సభ నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

సోనియాగాంధీ వ‌స్తే పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించి.. కాంగ్రెస్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రల్లో పాల్గొన్నారు. నవంబర్‌ 23న రాజస్థాన్‌లో ప్రచారం ముగియనుండటంతో.. నవంబర్ 24 నుంచి దాదాపు ఐదు రోజుల పాటు కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలో మకాం వేస్తారని సమాచారం. నవంబర్‌ 30న తెలంగాణలోని 119 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

First Published:  11 Nov 2023 8:09 AM GMT
Next Story