Telugu Global
Telangana

నా మాటలను కొన్నింటిని ఎడిట్ చేసి లీక్ చేశారు,నెనలా అనలేదు... కోమటి రెడ్డి

తనను చెరకు సుధాకర్ ఎంతగా దూషించినా తాను ఇంత కాలం సహనంగా ఉన్నానన్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. 33 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ ప్రత్యర్థులను కానీ.. మరెవరినీ దూషించలేదన్నారు.

నా మాటలను కొన్నింటిని ఎడిట్ చేసి లీక్ చేశారు,నెనలా అనలేదు... కోమటి రెడ్డి
X

కాంగ్రెస్ నాయకుడు చెరుకు సుధాకర్ ను, ఆయన కుమారుడిని తన అభిమానులు చంపేస్తారంటూ, వందకార్లలో చెరుకు సుధాకర్ కోసం తిరుగుతున్నారని ఫోన్లో బెదిరింపులకు పాల్పడిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఆడియో సంచలనం సృష్టిస్తున్నది. దీనిపై చెరకు సుధాకర్ అధిష్టానానికి పిర్యాదు కూడా చేశారు.ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ఆడియో లీక్ చేశారని ఆరోపించారు. తనను చెరకు సుధాకర్ ఎంతగా దూషించినా తాను ఇంత కాలం సహనంగా ఉన్నానన్నారు. 33 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ ప్రత్యర్థులను కానీ.. మరెవరినీ దూషించలేదన్నారు. శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం తనదని వెల్లడించారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఫోన్ రికార్డు చేస్తున్న విషయం కూడా తనకు తెలుసునని కోమటిరెడ్డి చెప్పారు.

చెరకు సుధాకర్ పార్టీలో చేరినప్పటి నుంచి తనను తిడుతున్నాడ‌ని , తనను తిడితే నకిరేకల్ టికట్ వస్తుందని ఆయన భావిస్తున్నాడ‌ని, తనకు వ్యతిరేకంగా నకిరేకల్ లో పోస్టర్లు వేశారని, అయినా తానేం అనలేదని, అయితే నా అభిమానులు నా పై ప్రేమతో చెరకు సుధాకర్ ను చంపేస్తారనే భయంతోనే ఆయన కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడానని కోమటి రెడ్ది అన్నారు.

First Published:  6 March 2023 8:18 AM GMT
Next Story