Telugu Global
Telangana

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ బంధువు పాత్ర... సిట్ విచారణలో వెల్లడి

టీఆరెస్ ఎమ్మెల్యేల కొలుగోలు కేసుతో బండి సంజయ్ బంధువుకు లింక్ ఉన్నట్టు సిట్ తేల్చింది. ఎమ్మెల్యేల కొలుగోలు కేసులో నిందితుడైన సింహయాజీకి విమాన టిక్కెట్టు బుక్ చేసింది బండి సంజయ్ బంధువైన కరీంనగర్‌లోని ఓ న్యాయవాది అని తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ బంధువు పాత్ర... సిట్ విచారణలో వెల్లడి
X

టీఆరెస్ ఎమ్మెల్యేల కొలుగోలుకు కుట్ర చేసిన వ్యవహారంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బంధువు పాత్ర ఉన్నట్టు వెల్లడైంది. ఎమ్మెల్యేల కొలుగోలు కేసులో నిందితుడైన సింహయాజీకి విమాన టిక్కెట్టు బుక్ చేసింది బండి సంజయ్ బంధువైన కరీంనగర్‌లోని ఓ న్యాయవాది అని తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. అక్టోబర్ 26న తిరుపతి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సింహయాజీకి విమాన టికట్ బుక్ చేసింది ఆ న్యాయవాదే అని సిట్ తేల్చినట్టు తెలంగాణ టుడే

తెలంగాణ టుడే నివేదిక ప్రకారం... ఈ కేసులో మరో నిందితుడైన నంద కుమార్ తో ఆ న్యాయవాది అక్టోబర్ 14న ఫోన్ లో మాట్లాడారని, ఆ తర్వాత అక్టోబరు 26న సింహయాజీకి టికెట్ బుక్ చేశారని సిట్ విచారణలో తెలిసింది.

కాల్ డేటా రికార్డులను సేకరించిన పోలీసులకు, ఈ కోవర్ట్ ఆపరేషన్ గురించి మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు తెలిసినట్టు సమాచారం.

న్యూఢిల్లీలోని బిజెపి అగ్రనాయకత్వం ఆదేశాల మేరకే ఆపరేషన్ చేపట్టామని ముగ్గురు నిందితులు సిట్ విచారణలో ఒప్పుకున్నారని తెలుస్తోంది. దీనిపై బీజేపీ నాయకులు అంత హైరానా ఎందుకు పడుతున్నారో, హడావుడి ఎందుకు చేస్తున్నారో దీన్ని బట్టి అర్దమవుతున్నది. హడావుడిగా బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేయడం, సీబీఐ విచారణ కోరడం, కేసుపై పోలీసుల దర్యాప్తుపై స్టే పొడిగించాలని కోరుతూ బీజేపీ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం..ఇదంతా ఎందుకో సిట్ విచారణలో తేలుతున్న విషయాలను బట్టి అర్దమవుతోంది.

మరో పరిణామం ఏమిటంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్లాన్లను తిప్పికొట్టి, నిందితులను పోలీసులకు పట్టించిన నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ బెదిరింపు కాల్స్‌పై ఎమ్మెల్యేలు త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సమాచారం.

First Published:  12 Nov 2022 3:00 AM GMT
Next Story