Telugu Global
Telangana

అసెంబ్లీ బ‌రిలో నాటునాటు పోర‌డు!

త‌న గాత్రంతో మాస్‌, క్లాస్‌, యూత్‌, ఓల్డ్ అనే తేడా లేకుండా అంద‌రినీ అల‌రిస్తున్న ఈ ప‌క్కా హైద‌రాబాదీ పోర‌గానికి సీటిస్తే ఎమ్మెల్యే అవుతాడా అనే విశ్లేష‌ణ‌లు అప్పుడే మొద‌లైపోయాయి.

అసెంబ్లీ బ‌రిలో నాటునాటు పోర‌డు!
X

నాటునాటు పాట‌తో దేశాన్ని ఊపేసి, ఆస్కార్ స్టేజీపై ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన ప్లేబాక్ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ రాజ‌కీయాల్లోకి దిగి అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నాడా..? రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దూక‌బోతున్నాడా..? అంటే అవునంటున్నాయి టీపీసీసీ వ‌ర్గాలు. కాంగ్రెస్ టికెట్ కోసం రాహుల్ సిప్లీగంజ్ ద‌రఖాస్తు చేసుకున్నాడ‌ని చెబుతున్నాయి. త‌న గాత్రంతో మాస్‌, క్లాస్‌, యూత్‌, ఓల్డ్ అనే తేడా లేకుండా అంద‌రినీ అల‌రిస్తున్న ఈ ప‌క్కా హైద‌రాబాదీ పోర‌గానికి సీటిస్తే ఎమ్మెల్యే అవుతాడా అనే విశ్లేష‌ణ‌లు అప్పుడే మొద‌లైపోయాయి.

గోషామ‌హ‌ల్ నుంచి పోటీ!

హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని గోషామ‌హ‌ల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి రాహుల్ ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలిసింది. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మంగ‌ళ్ హాట్ అత‌ని స్వ‌స్థలం. స్థానికుడిగా ముద్ర‌, వెనక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన యువ‌కుడు కావ‌డం, సింగ‌ర్‌గా అత‌నికున్న క్రేజ్ ఓట్లు తెచ్చిపెడ‌తాయ‌ని కాంగ్రెస్ భావిస్తే టికెట్ ప‌క్కా అవుతుంది. అదీకాక ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ టికెట్ ఆశించే వాళ్ల‌లో క‌నీసం రాహుల్ అంత ఫేమ్ ఉన్న వాళ్లు కూడా ఎవ‌రూ లేక‌పోవ‌డం ఈ నాటునాటు పోర‌డికి ప్ల‌స్‌పాయింటే..

బిగ్‌బాస్‌తో బాగా ఫేమ్‌లోకి

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌తో రాహుల్ సిప్లీగంజ్ బాగా ఫేమ్‌లోకి వ‌చ్చాడు. ఫోక్ సింగ‌ర్‌గా, అడ‌పాద‌డ‌పా సినిమా పాట‌ల‌తో అల‌రించినా అత‌ను అంద‌రికీ తెలిసింది మాత్ర‌మే బిగ్‌బాస్ షోతోనే అని చెప్పాలి. బిగ్‌బాస్ తెలుగు షో మూడో సీజ‌న్‌ విన్న‌ర్‌గా నిలిచాడు. సిప్లీగంజ్ ఆ షోలో మ‌రో కంటెస్టెంట్ పున‌ర్వ‌వీ భూపాలంతో న‌డిపిన ట్రాక్ జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకుంది. వారిద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని, పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని విప‌రీత‌మైన ప్ర‌చారం న‌డిచింది. అయితే తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని పున్నూ క్లారిటీ ఇచ్చింది.

*

First Published:  26 Aug 2023 7:09 AM GMT
Next Story