Telugu Global
Telangana

దర్గాను దర్శించుకుంటే తప్పేంటి? రెచ్చిపోతున్న హిందూవాదులు

ఇటీవల మంగ్లీ ఓ దర్గాను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

దర్గాను దర్శించుకుంటే తప్పేంటి?  రెచ్చిపోతున్న హిందూవాదులు
X

మన దేశం విభిన్న ఆచారాలు, సంస్కృతులు, మతాలు, కులాల సమ్మేళనం. ఇక్కడ అన్ని కులాలవాళ్లు, మతాల వాళ్లు, సంప్రదాయాల వాళ్లు ఉంటారు. అందుకే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కొందరు హిందూవాదులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని వివాదం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ప్రముఖ సింగర్ మంగ్లీ గతంలో ఓ సారి హిందూ అతివాదుల విమర్శలకు గురైన విషయం తెలిసిందే. అమ్మవారికి సంబంధించిన ఓ పాటకు ఆమె చేసిన నృత్యం అసభ్యంగా ఉందంటూ కొందరు ఆమెను టార్గెట్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా సింగర్ మంగ్లీని మరోసారి వీళ్లు టార్గెట్ చేశారు. ఇటీవల ఆమె ఓ దర్గాను దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫొటోలను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హిందువులు ముస్లింల దర్గాలకు ఎందుకు వెళ్లాలి.. ముస్లింలు మన గుడులకు రారు కదా.. అంటూ మంగ్లీని టార్గెట్ చేశారు.

రాయలేని భాషలో ట్వీట్లు పెట్టి ఆమె మనసును గాయపరిచారు. కాగా కొందరు మంగ్లీకి మద్దతు ఇచ్చిన వాళ్లూ ఉన్నారు. వినాయకచవితి సహా.. వివిధ వేడుకల్లో కొందరు ముస్లింలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారని వారు గుర్తు చేస్తున్నారు. దేశంలో అన్ని మతాలవాళ్లు కలిసి ఉండటం కొంతమందికి ఎందుకు నచ్చడం లేదని .. ప్రశ్నిస్తున్నారు. దర్గాను దర్శించుకుంటే తప్పేంటని అడుగుతున్నారు.

First Published:  17 Nov 2022 10:06 AM GMT
Next Story