Telugu Global
Telangana

సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్‌.. క్లారిటీ ఇదే.!

శుక్రవారం అర్ధరాత్రి దాటాక కన్హ శాంతివనం నుంచి తిరిగివస్తుండగా.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాను మంగ్లీ కారును వెనుక నుంచి ఢీ కొట్టినట్లు శంషాబాద్ పోలీసు అధికారులు చెప్తున్నారు.

సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్‌.. క్లారిటీ ఇదే.!
X

ప్ర‌ముఖ సింగర్‌ మంగ్లీకి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. శంషాబాద్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తొండుపల్లి గేట్‌ దగ్గర సింగర్‌ మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. కానీ, మంగ్లీకి ఎటువంటి గాయాలు కాలేదన్నారు అధికారులు.

శుక్రవారం అర్ధరాత్రి దాటాక కన్హ శాంతివనం నుంచి తిరిగివస్తుండగా.. కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాను మంగ్లీ కారును వెనుక నుంచి ఢీ కొట్టినట్లు శంషాబాద్ పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు ఇండికేటర్ డ్యామేజ్ అయిందని.. అంతకు మించి ఏం జరగలేదన్నారు.

డీసీఎం డ్రైవర్‌పై IPC 279 సెక్షన్ ప్రకారం నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మంగ్లీకి గాయాలయ్యాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు పోలీసులు.

First Published:  18 March 2024 5:19 AM GMT
Next Story