Telugu Global
Telangana

దేశంలోనే నెం.1గా అవతరించిన‌ సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్

దేశంలోని 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్ల PLFలను అధిగమించి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఈ స్థానాన్ని సాధించడం ఇది రెండోసారి.సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA) ప్రచురించిన 25 ఉత్తమ ప్లాంట్ల జాబితాలో, రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరే ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్‌కు చోటు దక్కలేదు.

దేశంలోనే నెం.1గా అవతరించిన‌ సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్
X

సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) నిర్వహించే సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (STPS) దేశంలోని టాప్ 25 థర్మల్ పవర్ ప్లాంట్ల జాబితాలో అత్యధిక ప్లాంట్ లోడ్ ( PLF)ఫ్యాక్టర్ తో మొదటి స్థానంలో నిలిచింది.

సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ PLF 91.15 శాతంగా ఉంది దీని దరిదాపుల్లో కూడా ఏ పవర్ ప్లాంట్ లేదు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ఈ విషయాన్ని ప్రకటించింది.

దేశంలోని 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంట్ల PLFలను అధిగమించి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ ఈ స్థానాన్ని సాధించడం ఇది రెండోసారి.సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(CEA) ప్రచురించిన 25 ఉత్తమ ప్లాంట్ల జాబితాలో, రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరే ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ ప్లాంట్‌కు చోటు దక్కలేదు.

ఈ అంశంపై సింగరేణి కాలిరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగించి రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

Next Story