Telugu Global
Telangana

అత్యధిక లోడ్ ఫ్యాక్టర్: సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే నెంబర్ 1

దేశంలోని 250 కంటే ఎక్కువ గా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ స్టేషన్లలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (STPS) అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యుత్తమ థర్మల్ పవర్ స్టేషన్‌గా రికార్డు సృష్టించింది.

అత్యధిక లోడ్ ఫ్యాక్టర్: సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ దేశంలోనే నెంబర్ 1
X

సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (STPS) 90.86 శాతంతో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (PLF)ని సాధించింది, ఇది ఈ సంవత్సరం దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పవర్ స్టేషన్లలో అగ్రస్థానం. ఛత్తీస్‌గఢ్‌లోని NTPC కోర్బా సూపర్ పవర్ థర్మల్ స్టేషన్ 90.01 శాతం రెండవ స్థానంలో ఉండగా, NTPC యొక్క సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ 89.94 శాతం మూడవ‌ స్థానంలో నిలిచింది.

(PLF అంటే ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన సగటు శక్తి, ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి చేయగల గరిష్ట శక్తికి నిష్పత్తి. ఎక్కువ PLF ఫలితంగా ఎక్కువ రాబడి వస్తుంది. ఉత్పత్తి అయ్యే శక్తికి యూనిట్ (kWh) ఖర్చు తక్కువగా ఉంటుంది)

పవర్ స్టేషన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ, 2016 ఆగస్టులో ప్రారంభించబడిన STPS ప్రారంభం నుండి మంచి పనితీరును కనబరుస్తోందని, ఇప్పటికే నాలుగుసార్లు 100 శాతం PLF సాధించిందని అన్నారు. సెప్టెంబరు 2018, ఫిబ్రవరి 2019, ఫిబ్రవరి 2020, మార్చి 2022లో ప్లాంట్ 100 శాతం కంటే ఎక్కువ పీఎల్‌ఎఫ్‌ని సాధించిందని ఆయన చెప్పారు. "ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్లు ఉన్నాయి. రెండవ యూనిట్ ఇప్పటివరకు 10 సార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ని అధిగమించింది. మొదటి యూనిట్ ఏడుసార్లు 100 శాతం PLF ను సాధించింది " అని తెలిపారు.

దేశంలోని 250 కంటే ఎక్కువ గా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ థర్మల్ పవర్ స్టేషన్లలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ (STPS) అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యుత్తమ థర్మల్ పవర్ స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. STPS ప్రారంభమై ఆరేళ్లు మాత్రమే అయినప్పటికీ, ప్లాంట్‌ ప్రారంభమైనప్పటి నుంచి అత్యుత్తమ PLFతో దేశంలోనే అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో టాప్‌ 25లో నిలిచిందని ఆయన తెలిపారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో STPS మొదటి స్థానంలో నిలిచింది. 2020-21లో అదే విభాగంలో రెండవ స్థానంలో నిలిచింది. రాష్ట్ర అవసరాల కోసం STPS ఇప్పటి వరకు 51,547 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసిందని శ్రీధర్ చెప్పారు.

సింగరేణి ప్లాంట్ పురోగతిని అభినందిస్తూ, అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించార‌ని, త్వరలోనే ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

First Published:  3 Dec 2022 3:43 AM GMT
Next Story