Telugu Global
Telangana

సింగరేణికి బెస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు

అతి తక్కువ కాలంలో పర్యావరణ అనుకూల, 224 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు సింగరేణికి ఈ అవార్డు లభించింది.

సింగరేణికి బెస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు
X

సింగరేణి కాలీరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బెస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డును అందుకుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (E&M) డి సత్యనారాయణరావు ఈ అవార్డును అందుకున్నారు.

అతి తక్కువ కాలంలో పర్యావరణ అనుకూల, 224 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించినందుకు సింగరేణికి ఈ అవార్డు లభించింది. సింగరేణి ఏర్పాటు చేసిన తొమ్మిది సోలార్ ప్లాంట్ల నుంచి 615 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది.

First Published:  29 April 2023 3:08 PM GMT
Next Story