Telugu Global
Telangana

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై తెలంగాణ డీజీపీ దావా.. రూ.2 లక్షల పరిహారం

అసౌకర్యంతో ఇబ్బంది పడ్డ డీజీపీ, బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని, అయినప్పటికీ ప్రయాణమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై తెలంగాణ డీజీపీ దావా.. రూ.2 లక్షల పరిహారం
X

ప్రయాణంలో ఆసౌకర్యం కలిగినందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. పరిహారంగా రూ.2 లక్షలు తిరిగి అందుకున్నారు. గతేడాది మే 23న సతీసమేతంగా హైదరాబాద్ నుంచి సింగపూర్‌ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు డీజీపీ రవి గుప్తా. అయితే వీరు ప్రయాణించిన బిజినెస్ క్లాస్‌లో రిక్లైనర్ సీట్లు పని చేయకపోవడంతో డీజీపీ ఫిర్యాదు చేశారు.

అసౌకర్యంతో ఇబ్బంది పడ్డ డీజీపీ, బిజినెస్ క్లాస్ టికెట్ల కోసం ఒక్కొక్కరికి రూ.66,750 చెల్లించామని, అయినప్పటికీ ప్రయాణమంతా మేల్కొని ఉండాల్సి వచ్చిందని, ఇది ఎకానమీ క్లాస్ ధర రూ.18,000 కంటే రూ.48,750 ఎక్కువ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక బిజినెస్ క్లాస్ కోసం డబ్బు చెల్లిస్తే తమను ఎకానమీ క్లాస్ ప్రయాణికులుగా పరిగణించారని, అదనపు లెగ్‌రూమ్ కూడా మినహాయించారని ఆరోపించారు.

దీనిపై స్పందించిన సింగపూర్ ఎయిర్ లైన్స్.. వారికి కలిగిన అసౌకర్యానికి ఒక్కో వ్యక్తికి 10,000 క్రిస్‌ఫ్లైయర్ మైళ్లను ఆఫర్ చేసింది. అయితే ఫిర్యాదుదారులు ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో..హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ని ప్రతి ఫిర్యాదుదారునికి రూ.48,750 చొప్పున మొత్తం రూ.97,500... మే 23, 2023 నుండి వారు రియలైజ్ అయ్యే వరకు 12% వడ్డీ చొప్పున వారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేగాక ఫిర్యాదుదారుల మానసిక వేదన మరియు శారీరక బాధల కోసం రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని, అలాగే ఫిర్యాదు ఖర్చుల కోసం రూ.10,000 చెల్లించాలని సింగపూర్ ఎయిర్ లైన్స్ కి ఆదేశాలు జారీ చేసింది.

First Published:  25 April 2024 2:39 PM GMT
Next Story