Telugu Global
Telangana

షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ సుజాత మృతి, గతంలో భర్త ఆత్మహత్య

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2020లో సుజాత అరెస్ట్ అయ్యారు. బంజారాహిల్స్‌ భూవివాదంలో ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్టు అప్పట్లో తేల్చారు.

షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ సుజాత మృతి, గతంలో భర్త ఆత్మహత్య
X

హైదరాబాద్ షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత మృతి చెందారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తొలుత వార్తలొచ్చాయి. కుటుంబ సభ్యులు మాత్రం ఆమె అనారోగ్యంతో పాటు గుండెపోటు కారణంగా చనిపోయారని చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2020లో సుజాత అరెస్ట్ అయ్యారు. బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్టు అప్పట్లో తేల్చారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఏసీబీ దాడుల సమయంలో ఆమె ఇంట్లో రూ.30 లక్షల నగదు కూడా దొరికింది.

సుజాత అరెస్ట్‌ సమయంలో అవమానాన్ని భరించలేక ఆమె భర్త అజయ్‌ కుమార్‌ ఐదు అంతస్తుల భవనం మీద నుంచి దూకి 2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. చెల్లి ఇంటికి వెళ్లి అజయ్ అక్కడే భవనంపై నుంచి దూకేశారు. సుజాత ఏసీబీకి పట్టుబడిన సమయంలో అజయ్‌ కుమార్‌నూ పోలీసులు విచారించారు. అజయ్ ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు.

ఇప్పుడు సుజాత కూడా ప్రాణాలు కోల్పోయారు. మానసికవేద‌న‌ ఆమె మృతికి కారణంగా భావిస్తున్నారు. తీవ్రమైన మానసిక క్షోభతో బాధపడుతున్న సుజాతకు మళ్లీ విధుల్లోకి చేరే అవకాశం ఇచ్చిన ఆమె తిరస్కరించారు. సుజాత డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.14 లోని రూ. 40 కోట్ల విలువైన భూమి కేసులో లంచం తీసుకున్నట్లు తేలడంతో 2020లో ఆమెపై కేసు నమోదు అయింది.

First Published:  3 Sep 2022 6:19 AM GMT
Next Story