Telugu Global
Telangana

బాలికపై లైంగిక దాడి.. తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు..

ఈ ఘటనకు కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని ఆమె సూచించారు.

బాలికపై లైంగిక దాడి.. తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు..
X

హైదరాబాద్ లో LKG బాలికపై లైంగిక దాడి సంచలనంగా మారింది. టీఆర్ఎస్‌ ప్రభుత్వం బాధితులకు బాసటగా నిలిచింది. ఈ ఘటనకు కారణమైన బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా విద్యా శాఖాధికారిని ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని ఆమె సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత డీఈవోకి అప్పగించారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు. ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ డిటెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందించాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

అసలేం జరిగింది..?

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని DAV స్కూల్ లో LKG విద్యార్థిని పై లైంగిక దాడి జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మహిళా ప్రిన్సిపల్ కి ఈ విషయం తెలిసినా కూడా ఆమె అడ్డుకోకపోవడం గమనార్హం. దీంతో డ్రైవర్ రజినీ కుమార్, ప్రిన్సిపల్ మాధవి పై పోలీసులు కేసు పెట్టారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్కూల్ గుర్తింపు రద్దు చేసింది. అదే సమయంలో ఇతర పిల్లలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది.

First Published:  21 Oct 2022 10:39 AM GMT
Next Story