Telugu Global
Telangana

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు!

తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. సమావేశం తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌ బాబు కేబినెట్ మీటింగ్ విశేషాలు వెల్లడించారు.

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు!
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ఓకే చెప్పింది. తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. సమావేశం తర్వాత మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌ బాబు కేబినెట్ మీటింగ్ విశేషాలు వెల్లడించారు.

కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే -

> వాహనాల రిజిస్ట్రేషన్‌లో TS స్థానంలో కేంద్రం ఇచ్చిన గెజిట్ ప్రకారం TGగా మారుస్తూ నిర్ణయం

> తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా అందె శ్రీ రచించిన జయజయహే తెలంగాణ

> తెలంగాణ చిహ్నంలో మార్పులు

> తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు

> గ్రూప్‌-1,2,4 భర్తీ ప్రక్రియపై చర్చ

> ఫిబ్రవరి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్ణయించాలని నిర్ణయం

> తెలంగాణలో కులగణన చేపట్టాలని నిర్ణయం

> మరో రెండు గ్యారెంటీల అమలుకు ఆమోదం

> తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయిస్తూ తీర్మానం

> నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

> కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటి ఏర్పాటు

> 65 ఐఐటీలను అడ్వాన్స్‌డ్‌ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం

First Published:  5 Feb 2024 2:43 AM GMT
Next Story