Telugu Global
Telangana

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం, ఉదయం నుంచి అదుపులోకి రాని మంటలు

రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న 15 పైగా అగ్నిమాపక బృందాలు, 15 ఫైర్ ఇంజన్లతో ఉదయం నుంచి తీవ్రంగా శ్ర‌మిస్తున్నప్పటికీ అగ్నికీలలు అదుపులోకి రాకపోగా ఎగిసి పడుతున్న పొగవల్ల పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం, ఉదయం నుంచి అదుపులోకి రాని మంటలు
X

సికింద్రాబాద్, రాంగోపాల్ పేటలోని డెక్కన్ కాంప్లెక్స్‌ లో మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. ఉదయ‍ం 11 గంటలకు అగ్ని ప్రమాదం జరగగా ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. పక్కనున్న మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి.

రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న ౩౦కి పైగా అగ్నిమాపక బృందాలు, 30 ఫైర్ ఇంజన్లతో ఉదయం నుంచి తీవ్రంగా శ్ర‌మిస్తున్నప్పటికీ అగ్నికీలలు అదుపులోకి రాకపోగా ఎగిసి పడుతున్న పొగవల్ల పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.

మంటలు తీవ్రంగా ఉండటంతో డెక్కన్ కాంప్లెక్స్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఏ క్షణమైనా ఆ భవనం కుప్పకూలే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనంలో భారీగా పేలుడు శబ్దాలు వస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రధాన రహదారి వైపు వాహనాలను దారి మళ్లించారు.

మరో వైపు అగ్నిప్రమాద భవనాన్ని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. అధికారులతో వివరాలుఅడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవ్వరూ చనిపోలేదని, అయితే ఇద్దరి వ్యక్తుల ఆచూకీ తెలియడం లేదని చెప్పారు. ఇప్పటికే 80 శాతం మంటలు అదుపులోకి వచ్చాయ‌ని మరి కొద్ది సేపట్లో పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆయన తెలిపారు.

కాగా నిబంధనలకు విరుద్ధంగా తయారీ యూనిట్ ఇక్కడ పెట్టడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అనుమతులు లేకుండా జనావాసాల్లో నడుస్తున్న తయారీ యూనిట్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

First Published:  19 Jan 2023 1:42 PM GMT
Next Story