Telugu Global
Telangana

సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్: మృతుల‌ కుటుంబాలకు 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

సికిందరాబాద్ రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర, కే౦‍ద్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రధాని నరేం ద్రమోడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సంఘటన పట్ల సంతాపం తెలిపారు.

సికింద్రాబాద్ ఫైర్ ఆక్సిడెంట్: మృతుల‌ కుటుంబాలకు 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
X

సికిందరాబాద్ రూబీ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈ విషయంపై రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

సికిందరాబాద్, రూబీ లాడ్జి సెల్లార్లోని ఈ బైక్ ల షోరూంలో బ్యాటరీలపేలుడు కారణంగా మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో 8 మంది చనిపోగా పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మరో వైపు మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు.

First Published:  13 Sep 2022 6:07 AM GMT
Next Story