Telugu Global
Telangana

జాతీయ పార్టీని స్వాగ‌తిస్తూ పూరీ బీచ్ లో కెసిఆర్ సైక‌త శిల్పం

కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న జాతీయ పార్టీకి మద్దతుగా ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. కేసీఆర్ తలపెట్టిన లక్ష్యం సాకారమవ్వాలనే ఆకాంక్ష‌తో ఈ సైకత శిల్పాన్ని తయారుచేయించినట్టు అరవింద్ పేర్కొన్నారు.

జాతీయ పార్టీని స్వాగ‌తిస్తూ పూరీ బీచ్ లో కెసిఆర్ సైక‌త శిల్పం
X

జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించాల‌న్నటీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర రావు(కెసిఆర్) ఆలోచ‌న‌కు విస్తృతంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయ‌న జాతీయ రాజ‌కీయ ప్రవేశాన్ని స్వాగ‌తిస్తూ ప‌లు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు, స‌మావేశాలు, చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కెసిఆర్ జాతీయ పార్టీ వివ‌రాలు వెల్ల‌డిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, చిహ్నం వంటి విష‌యాల‌ను ప్ర‌క‌టించ‌నున్నార‌ని ముహుర్తం ఖ‌రారు చేశార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

దేశంలో ఫెడ‌ర‌ల్ స్ఫూర్తిని ప‌రిర‌క్షించ‌డంతో పాటు దేశం ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, వ‌న‌రుల స‌మ‌ర్ధ వినియోగం, దేశాన్ని ప్ర‌పంచ‌ప‌టంలో అగ్ర‌గామిగా నిల‌పాల‌న్న ల‌క్ష్యంతో కెసిఆర్ జాతీయ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం జ‌రుగుతోంది.

ఈ నేపథ్యంలో పూరీ సముద్ర తీరంలో టీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ కేసీఆర్ పార్టీని స్వాగతిస్తూ సైకత శిల్పాన్ని తయారుచేయించారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, దేశ్‌ కీ నేతా కేసీఆర్, కిసానోంకా భరోసా, వెల్కం టు నేషనల్ పాలిటిక్స్ అంటూ స్వాగతించారు. కేసీఆర్ తలపెట్టిన లక్ష్యం సాకారమవ్వాలనే ఆకాంక్ష‌తో ఈ సైకత శిల్పాన్ని తయారుచేయించినట్టు అరవింద్ పేర్కొన్నారు. అక్కడి పర్యాటకులు సైకత శిల్పాన్ని ఆసక్తిగా తిలకించారని, పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారని తెలిపారు.

First Published:  4 Oct 2022 5:30 AM GMT
Next Story