Telugu Global
Telangana

హైదరాబాద్ కంపెనీలో సచిన్ కు వాటా..

సచిన్ మన హైదరాబాద్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, భాగస్వామి అయ్యారు. పెట్టుబడి ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సచిన్ భాగస్వామిగా ఉన్న ఆ కంపెనీ పేరు ఆజాద్ ఇంజినీరింగ్.

హైదరాబాద్ కంపెనీలో సచిన్ కు వాటా..
X

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ చాలాసార్లు వచ్చి ఉంటారు, హైదరాబాద్ లో ఆయనకు చాలామంది స్నేహితులు కూడా ఉన్నారు. కానీ హైదరాబాద్ కి చెందిన ఓ కంపెనీలో సచిన్ కూడా పార్టనర్ అనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. అవును, సచిన్ మన హైదరాబాద్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, భాగస్వామి అయ్యారు. పెట్టుబడి ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సచిన్ భాగస్వామిగా ఉన్న ఆ కంపెనీ పేరు ఆజాద్ ఇంజినీరింగ్.

ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ క్లీన్‌ ఎనర్జీ, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, ఇంధన రంగాల సంస్థలకు పలు రకాల ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, విడిభాగాలు సరఫరా చేస్తోంది. బోయింగ్‌, జీఈ, మిత్సుబిషి, సీమెన్స్‌ ఎనర్జీ, హనీవెల్‌, ఈటన్‌, జీఈ ఏరోస్పేస్‌, బేకర్‌ హ్యూస్‌... తదితర అంతర్జాతీయ కంపెనీలు ఆజాద్ ఇంజినీరింగ్ నుంచి విడిభాగాలు తీసుకుంటాయి. 2008లో ఈ కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీకి ఎండీ రాకేష్ ఛోఫ్దార్. ప్రస్తుతం రాకేష్, సచిన్ టెండూల్కర్ కి పార్టనర్ అన్నమాట. సచిన్ తమ సంస్థలో వాటాదారుడు కావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రాకేష్. నాణ్యమైన ఉత్పత్తులతో వ్యాపార రంగంలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు రాకేష్.

త్వరలో ఐపీఓ..

ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ త్వరలో పబ్లిక్‌ ఇష్యూ (IPO)కు వెళ్లబోతోంది. ఐపీఓతో నిధులు సమీకరించి ఈ కంపెనీని మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉంది యాజమాన్యం. సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం ఈ కంపెనీలో వాటాదారు కాబట్టి.. ఐపీఓకి అనూహ్య స్పందన ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ మధ్య నెల్లూరు జిల్లాలో పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకుని ఏపీతో అనుబంధం ఏర్పాటు చేసుకున్న సచిన్, ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలో పెట్టుబడి పెట్టి.. తెలంగాణతోనూ తన అనుబంధాన్ని పెంచుకున్నారు.

First Published:  16 May 2023 12:24 PM GMT
Next Story