Telugu Global
Telangana

మండుటెండల్లో కేసీఆర్.. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి

రైతుల క‌ష్టాలు తెలుసుకునేందుకు మండుటెండ‌ల్లో కేసీఆర్ తిరుగుతుంటే.. ఎవ‌రైనా ఎక్క‌డైనా చావ‌మని చెప్పి ఉప్ప‌ల్ స్టేడియంలో కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్.

మండుటెండల్లో కేసీఆర్.. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి
X

తెలంగాణ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయని అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున ఆయన ప్రచారం చేపట్టారు. ఇక్కడ జరుగుతోంది వినోద్ కుమార్‌, బండి సంజ‌య్ మ‌ధ్య పోరాటం కాదని.. ప్రజలపై గుండెలనిండా ఉన్న ప్రేమకు, గుట్కా ప్యాకెట్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. ఇది కేసీఆర్, రేవంత్ రెడ్డి మ‌ధ్య పోరాటం కాదని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, తెలంగాణ ద్రోహుల‌కు మ‌ద్య జ‌రుగుతున్న యుద్ధం అని వివరించారు. ప‌దేళ్ల నిజ‌మైన పాల‌న‌కు, 100 రోజుల అబ‌ద్దానికి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోందని చెప్పారు ప్రవీణ్ కుమార్.

రైతుల క‌ష్టాలు తెలుసుకునేందుకు మండుటెండ‌ల్లో కేసీఆర్ తిరుగుతుంటే.. ఎవ‌రైనా ఎక్క‌డైనా చావ‌మని చెప్పి ఉప్ప‌ల్ స్టేడియంలో కూర్చొని సీఎం రేవంత్ రెడ్డి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. 200 మంది రైతులు చ‌నిపోయార‌ని చెప్పిన‌ప్పుడు.. తెలివైన సీఎం అయితే వివ‌రాలు సేక‌రించి, వారి ద‌గ్గ‌ర‌కు వెళ్తారని కానీ రేవంత్ రెడ్డి అలా చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి అహంకారి కాబట్టే.. మీ ద‌గ్గ‌ర లిస్ట్ ఉంటే ఇవ్వండి వెరిఫై చేస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో అహంకారానికి కాకుండా ఆశ‌యానికి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు RSP.

క‌రీంన‌గ‌ర్ స్మార్ట్ సిటీ కావాలని, ప్ర‌పంచ పటంలో క‌నిపించాల‌ని ఆకాంక్షించారు RSP. రేవంత్ ఆదేశాల మేర‌కు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై పోలీసులు కేసులు పెడుతున్నారని, కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా పోరాటం చేయాలని, వినోద్‌కుమార్‌ను పార్ల‌మెంట్‌కు పంపించేంత వ‌ర‌కు నిద్ర పోవ‌ద్దని పిలుపునిచ్చారు. మన ఆత్మగౌరవం వెనక ఎంతోమంది మ‌హ‌నీయుల త్యాగం ఉందని గుర్తుంచుకోవాలని చెప్పారు. కరీంనగర్ లో బండి సంజ‌య్ గెలిస్తే, బీజేపీకి మెజార్టీ వ‌స్తే.. మోదీ, అమిత్ షా మ‌నుస్మృతి ఆధారంగా త‌యారు చేసుకున్న‌ రాజ్యాంగాన్ని పార్ల‌మెంట్‌లో ఆమోదిస్తారని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

First Published:  8 April 2024 2:10 PM GMT
Next Story