Telugu Global
Telangana

మహేష్‌బాబు ఇంట్లో చోరీయ‌త్నం.. దొంగకు తీవ్ర గాయాలు

30 అడుగుల నుంచి దూకడంతో అతడి తలకు గాయమైంది. మరికొన్ని చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహేష్‌బాబు ఇంట్లో చోరీయ‌త్నం.. దొంగకు తీవ్ర గాయాలు
X

టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు ఇంట్లో చోరీకి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఆ ప్రయత్నంలో దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. దొంగను పోలీసులకు అప్పగించగా.. అతడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.హైదరాబాద్‌లోని మహేష్‌బాబు నివాసంలోకి చొరబడేందుకు వెనుక ఉన్న 30 అడుగుల గోడను ఎక్కిదూకాడు ఓ దొంగ. పెద్ద శబ్ధం రాగా అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దొంగను పట్టుకున్నారు.

30 అడుగుల నుంచి దూకడంతో అతడి తలకు గాయమైంది. మరికొన్ని చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పట్టుబడిన దొంగ ఒడిశాకు చెందిన వాడు. మూడు రోజుల క్రితమే అతడు హైదరాబాద్‌ వచ్చాడు. మహేష్ బాబు తన తల్లి అంత్యక్రియల కార్యక్రమంలో ఉండగానే ఈ ఘటన జరిగింది. చోరి యత్నం జరిగిన సమయంలో మహేష్‌బాబు ఇంట్లో ఉన్నారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.

First Published:  29 Sep 2022 6:44 AM GMT
Next Story