Telugu Global
Telangana

రేవంత్‌ ఐదేళ్లు సీఎంగా ఉండాలే.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బహిరంగ సభల్లో ఆయన వణుకుడు చూస్తుంటే.. జనం తిరగబడ్డారని అర్థమవుతుందన్నారు కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లకంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు చెప్తున్నాయన్నారు.

రేవంత్‌ ఐదేళ్లు సీఎంగా ఉండాలే.. కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

రేవంత్‌ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉంటుందో, లేదో అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరు బీజేపీలో చేరతారో.. సీఎం రేవంత్‌ రెడ్డి జంప్‌ కొడతారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన జ‌హీరాబాద్, మెద‌క్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. బీజేపీకి ఓటేయాలని పిలుపునిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిందని తమకేమి అక్కసు లేదని.. రేవంత్ సర్కార్ ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.. ప్రజలకు నల్లదేదో, తెల్లదేదో అర్థమవుతుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే.. బహిరంగ సభల్లో ఆయన వణుకుడు చూస్తుంటే.. జనం తిరగబడ్డారని అర్థమవుతుందన్నారు కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 2 సీట్లకంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు చెప్తున్నాయన్నారు. అందుకే నారాయ‌ణ‌పేట స‌భ‌లో సీఎం భ‌యం చూస్తుంటే ఈ గ‌వ‌ర్నమెంట్ ఏడాది కూడా ఉండేట‌ట్టు లేద‌నిపిస్తోందన్నారు.

First Published:  17 April 2024 2:29 AM GMT
Next Story