Telugu Global
Telangana

ORR నుంచి RRR వరకు.. రేవంత్ రెడ్డి కీలక సూచనలు

ఔటర్ రింగ్‌ రోడ్డు(ORR) లోపలి వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు.

ORR నుంచి RRR వరకు.. రేవంత్ రెడ్డి కీలక సూచనలు
X

మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్‌ పై సమీక్ష జరిపారు.

ఔటర్ రింగ్‌ రోడ్డు(ORR) లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు(RRR) పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని చెప్పారు. ORR నుంచి RRR కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

మార్పుకి శ్రీకారం

తెలంగాణ అభివృద్ధి, మౌలిక వసతుల విషయంలో గత ప్రభుత్వ ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం నమూనా మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారాయన. వాహనాల నెంబర్ ప్లేట్ పై ఉన్న ఇంగ్లిష్ అక్షరాలను కూడా మార్చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ను మూడు భాగాలుగా వర్గీకరణ చేసి అభివృద్ధి చేస్తామంటున్నారు రేవంత్ రెడ్డి. అందులో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ లోపల, వెలుపల ఉన్న ప్రాంతాలు కీలకంగా మారే అవకాశముంది. అందుకే ఆ రెండు రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్లు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్ -2050పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కీలక చర్చలు జరిపారు.

First Published:  28 Feb 2024 12:22 PM GMT
Next Story