Telugu Global
Telangana

రేవంత్ పాద యాత్ర నేడే ప్రారంభం

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారాలమ్మ దేవతలకు పూజలు చేసి రేవంత్ తన పాద యాత్రనుప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి రేవంత్ ములుగు వెళ్తారు. ముందుగా గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు.

రేవంత్ పాద యాత్ర నేడే ప్రారంభం
X

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశవ్యాప్తంగా 'హాత్‌ సే హాత్‌ జోడో' యాత్రలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఈ రోజు ప్రారంభం కానుంది.

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారాలమ్మ దేవతలకు పూజలు చేసి రేవంత్ తన పాద యాత్రనుప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి రేవంత్ ములుగు వెళ్తారు. ముందుగా గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు.

మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్‌, ప్రాజెక్ట్‌ నగర్, పస్రా వరకు పాద యాత్ర కొనసాగుతుంది సాయంత్రం పస్రాలో బహిరంగ సభ అనంతరం రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకొని రాత్రికి రేవంత్‌రెడ్డి అక్కడే బస చేస్తారు. ఈ పాదయాత్రలో మొదటి రోజు ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాక్రే కూడా పాలొంటారు.

తన పాదయాత్రలో రేవంత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఇప్పటికే ములుగు ఎమ్మెల్యే సీతక్క, సిరిసిల్ల రాజయ్య తదితరులు పాదయాత్ర ఏర్పాట్లను పూర్తి చేశారు.


కాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం పూర్తయ్యాక సీఎల్ పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర ప్రారంభిస్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర సాగించనున్నారు.

First Published:  6 Feb 2023 2:49 AM GMT
Next Story