Telugu Global
Telangana

ఆధారాలున్నాయంటే అరెస్ట్ చేస్తారా..? రేవంత్ రెడ్డి ధ్వజం

హౌస్ అరెస్టులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. పేపర్ లీకేజీతో ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆధారాలున్నాయంటే అరెస్ట్ చేస్తారా..? రేవంత్ రెడ్డి ధ్వజం
X

TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈరోజు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్ ఆందోళనలకు దారి తీసింది. తమ వద్ద ఆధారాలున్నాయని, అవి చూపించడానికి వెళ్తుంటే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హౌస్ అరెస్టులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. పేపర్ లీకేజీతో ఆందోళనలో ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి విచారణ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు, అటు సిట్ కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రాహుల్ కి జైలు శిక్ష బాధాకరం.

రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైలు శిక్ష విధించడం షాక్ కు గురిచేసిందని అన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఇంతటి నిర్బంధం ఏమిటని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నాం.. మోదీ నియంత పాలనను ఎంతకాలం భరిద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు లేకుండా సాగుతున్న పాలనపై ప్రజలు తిరగబడక తప్పదన్నారు. రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మాట్లాడిన ఒక రాజకీయ ప్రకటన ను ఆసరా చేసుకొని మోదీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టం దావా వేసి కుట్రలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ కుటుంబం.. ఇలాంటి బెదిరింపులకు భయపడబోదన్నారు రేవంత్ రెడ్డి.

సంపన్న కుటుంబం, విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వేచ్ఛ తెచ్చిన కుటుంబం గాందీ కుటుంబం అని, వారు మోదీలకు భయపడబోరని అన్నారు రేవంత్ రెడ్డి. దేశం కోసం రాహుల్ గాంధీ తాత నెహ్రు పోరాటం చేసి జైలుకు వెళ్లారని, రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం దేహాన్ని ముక్కులు చేసినా భయపడలేదని చెప్పారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ మోదీ బెదిరింపులకు లొంగేది లేదన్నారు రేవంత్ రెడ్డి. సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామన్నారు.

First Published:  23 March 2023 8:15 AM GMT
Next Story