Telugu Global
Telangana

వీళ్ళిద్దరి అసలు అజెండా ఇదేనా?

తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎలా డెవలప్ చేయబోతున్నారో జనాలకు వివరించకుండా ఎంతసేపు కేసీఆర్‌ను, ఆయ‌న‌ కుటుంబాన్ని తిడుతుంటే జనాలు ఓట్లేస్తారా ?

వీళ్ళిద్దరి అసలు అజెండా ఇదేనా?
X

ఒకరేమో ప్రగతిభవన్‌ను పేల్చేస్తామంటారు. మరొకళ్ళేమో సచివాలయం భవనాల డోములను కూల్చేస్తామంటారు. ఇద్దరు చెప్పేది తాము అధికారంలోకి వస్తేనేలేండి. పేల్చటం, కూల్చటం ప్రకటనల వెనుక వీళ్ళ అసలు అజెండా దాగున్నట్లు అనుమానంగా ఉంది. ఇంతకీ ఆ అజెండా ఏమిటంటే జనాలను కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే. జనాలను రెచ్చగొట్టడం చాలా సులభం అని అందరికీ తెలిసిందే. అందుకనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డేమో హింసాత్మకంగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

ఇదే సమయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ జనాల్లోని సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు. ఎందుకంటే బండికి మొదటి నుండి కొట్టుడు, దంచుడు, భాగ్యలక్ష్మీ దేవాలయం, మసీదులు తప్ప మరొక‌టి తెలియ‌దు. నిజానికి కాంగ్రెస్ ప్రగతిభవన్‌ను పేల్చేదిలేదు, బీజేపీ సచివాలయం భవనాల డోములను కూలగొట్టే అవకాశమూలేదు. ఊరికే ఏదో ఒకటి చెబుతు జనాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పేబదులు జనాలకు ఉపయోగపడే మాటలు చెప్పవచ్చు.

Advertisement

కేసీఆర్‌ ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే, లోపాలుంటే జనాలకు వాటి గురించి చెప్పి తాము అధికారంలోకి వస్తే ఎలా రెక్టిఫై చేస్తామో వివరించి చెప్పవచ్చు. సంక్షేమ పథకాలను ఏ విధంగా మెరుగ్గా అమలుచేస్తామో చెప్పాలి. విద్య, వైద్యం రంగాలను ఏ విధంగా డెవలప్ చేస్తామనే విషయాలను వివరించాలి. వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, రైతుల కష్టాలను తీర్చే విషయంలో తమ ఆలోచనలను పంచుకోవచ్చు.

రాష్ట్ర ఆదాయాలను పెంచేందుకు తమ దగ్గరున్న వ్యూహాలేమిటో వివరించి, అప్పుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే విధానాన్ని జనాలకు వివరించాలి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణను ఎలా డెవలప్ చేయబోతున్నారో జనాలకు వివరించకుండా ఎంతసేపు కేసీఆర్‌ను, ఆయ‌న‌ కుటుంబాన్ని తిడుతుంటే జనాలు ఓట్లేస్తారా ? ప్రభుత్వం మీద జనాల్లో నిజంగానే వ్యతిరేకత ఉంటే వాళ్ళంతట వాళ్ళే ప్రత్యామ్నాయాలను చూసుకుంటారు. అందుకోసం రేవంత్, బండి జనాలను రెచ్చగొట్టాల్సిన అవసరమేలేదు. జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసే రోజులు పోయాయని పార్టీలు గ్రహించకపోవటమే విచిత్రంగా ఉంది.

Next Story