Telugu Global
Telangana

రైతు రుణమాఫీ.. సోనియా బర్త్‌డే కటాఫ్‌!

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. అప్పుడు 2019 డిసెంబర్‌ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించారు.

రైతు రుణమాఫీ.. సోనియా బర్త్‌డే కటాఫ్‌!
X

ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హామీ అమలుకు విధివిధానాలపై కసరత్తు వేగంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ పుట్టిన తేదీ (డిసెంబర్ 9)ని రైతు రుణమాఫీకి కటాఫ్‌ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అదేరోజు తెలంగాణ ప్రకటించిన తేదీ కూడా కావడంతో దీన్ని సెంటిమెంట్‌గా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2023 డిసెంబర్‌ 7ను రుణమాఫీకి కటాఫ్‌ తేదీగా చేయాలనే చర్చ కూడా జరుగుతోంది. ఈ రెండు తేదీల్లోనూ సోనియా పుట్టిన రోజునే కటాఫ్‌ తేదీగా తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇవాళ్టి కేబినెట్‌ భేటీలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం.

గతంలో డిసెంబర్‌ 11వ తేదీ కటాఫ్‌

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. అప్పుడు 2019 డిసెంబర్‌ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 9వ తేదీ వరకు రూ. 2 లక్షల రూపాయలలోపు రైతుల వ్యవసాయ పంట రుణాలను మాఫీచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే రుణ బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. అంటే బ్యాంకులకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాస్తవ రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే, వడ్డీతో కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశముంది.

First Published:  18 May 2024 8:05 AM GMT
Next Story