Telugu Global
Telangana

ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరంటే..!

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అచేతనంగా ఉన్న హౌసింగ్‌శాఖను పటిష్టం చేయడంపై దృష్టిపెట్టింది.

ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎవరంటే..!
X

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌పై రేవంత్‌ సర్కారు దృష్టిపెట్టింది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు హౌసింగ్‌శాఖ అధికారులు. నెలాఖరు కల్లా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వానికి అందజేస్తారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల స్కీమ్స్‌‌‌‌‌‌‌‌పై ప్రస్తుతం అధికారులు స్టడీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కీలకం. 100 శాతం సబ్సిడీతో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని రేవంత్ సర్కారు హామీ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్లపై పేదలు, సామాన్యులు గంపెడాశలు పెట్టుకున్నారు. అందుకే ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏకంగా 25లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేయబోతోంది ప్రభుత్వం.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, గృహలక్ష్మి స్కీమ్‌‌‌‌‌‌‌‌ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అర్హులకు కాకుండా అధికారపార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేల అనుచరులకు, ఇళ్లు ఉన్నోళ్లకే ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇళ్లు లేని పేదలను గుర్తించి, ఎలాంటి అవకతవకలు జరగకుండా స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల్ని డైరెక్టుగా గ్రామాల్లోనే ఎంపిక చేసేలా, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అచేతనంగా ఉన్న హౌసింగ్‌శాఖను పటిష్టం చేయడంపై దృష్టిపెట్టింది. అప్పుడే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. హౌసింగ్ శాఖలో ప్రస్తుతం 60మందే ఉన్నారు. దాదాపు 450 మంది అధికారులు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి శాఖల్లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వెళ్లారు. ఆ డిప్యూటేషన్లంటిని క్యాన్సిల్ చేసి అందర్ని హౌసింగ్‌‌‌‌‌‌‌‌ శాఖకు తిరిగి తీసుకురావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జనాల్లో ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న ఆశలు, గత ప్రభుత్వంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తోంది రేవంత్ ప్రభుత్వం.

First Published:  17 Jan 2024 6:11 AM GMT
Next Story