Telugu Global
Telangana

హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

హైదరాబాద్‌లో నైట్ కర్ఫ్యూ.. వెనక్కి తగ్గిన ప్రభుత్వం
X

హైదరాబాద్‌లో నైట్‌ కర్ఫ్యూపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తీవ్ర విమర్శలు రావడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. నైట్‌ కర్ఫ్యూ వార్తలు అవాస్తవం అంటూ హైదరాబాద్‌ సిటీ పోలీసులతో ట్విట్టర్‌లో ప్రకటన చేయించింది. వాస్తవానికి స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డే నైట్‌ కర్ఫ్యూపై ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సిటీలో నేరాలు పెరగడంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్షించిన ఆయన పోలీసులకు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాత్రి పూట బైక్‌ రైడ్స్‌ను సైతం అడ్డుకోవాలని పోలీసులకు సూచించారు.



పోలీసులకు సంబంధించి ఓ వీడియో సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 11 తర్వాత షాపులు ఓపెన్ చేసి ఉంచితే లాఠీ ఛార్జి చేస్తామంటూ ఈ వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఫ్రెండ్లీ పోలీసు ఉండదు.. కేవలం లాఠీ ఛార్జి పోలీసు మాత్రమే ఉంటుందంటూ వీడియోలో ఉంది. నైట్‌ కర్ఫ్యూ నిబంధనలంటూ పోలీసులు సైతం మైకులో అనౌన్స్ చేస్తూ, బ్యానర్లు కట్టి హైదరాబాద్‌లో ఆటోలు తిప్పారు.


ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నైట్‌ కర్ఫ్యూ అనేది అపోహ అంటూ హైదరాబాద్ పోలీసులతో ప్రకటన చేయించింది.

First Published:  25 Jun 2024 10:22 AM GMT
Next Story