Telugu Global
Telangana

చిన్నారెడ్డికి రేవంత్‌ బంపర్ ఆఫర్‌.. కేబినెట్‌ హోదాతో పదవి

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి మొదట చిన్నారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌. అయితే వెంటనే ఆయనను తప్పించి మేఘా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసింది

చిన్నారెడ్డికి రేవంత్‌ బంపర్ ఆఫర్‌.. కేబినెట్‌ హోదాతో పదవి
X

సీనియర్లకు ఒక్కొక్కరికి పదవులు కేటాయిస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. తాజాగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియామకమైన చిన్నారెడ్డి కేబినెట్ హోదాను కలిగి ఉండనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నుంచి మొదట చిన్నారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌. అయితే వెంటనే ఆయనను తప్పించి మేఘా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసింది. నిరంజన్ రెడ్డిపై మేఘారెడ్డి విజయం సాధించారు. తనను అభ్యర్థిగా తప్పించడంతో చిన్నారెడ్డి కొంత అసంతృప్తికి గురయ్యారు.

చిన్నారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2004లో వైఎస్సార్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

First Published:  24 Feb 2024 1:04 PM GMT
Next Story