Telugu Global
Telangana

రేవంత్‌.. నువ్వు చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా - హరీష్‌ రావు

కేసీఆర్ లాగు ఊడదీస్తానంటూ మాట్లాడుతున్నాడన్న హరీష్‌ రావు.. ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు.

రేవంత్‌.. నువ్వు చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా - హరీష్‌ రావు
X

వంద రోజుల పాలనలో కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్‌ రావు.. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తంలాగా తయరైందని ఎద్దేవా చేశారు.

ఇటీవల ఎండిపోయిన పంటలను పరిశీలించే క్రమంలో కేసీఆర్ సిరిసిల్లకు వెళ్లారని.. అక్కడ వడ్లకు బోనస్‌ రూ.500 అంశంపై మాట్లాడారని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ లాగు ఊడదీస్తానంటూ మాట్లాడుతున్నాడన్న హరీష్‌ రావు.. ముఖ్యమంత్రివా లేక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నోటితో తియ్యగా మాట్లాడిన రేవంత్‌ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారు హరీష్‌ రావు.


కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు హరీష్‌ రావు. తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పడిపోయిందన్నారు. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌ నేతలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు హరీష్‌ రావు. 2004 నుంచి మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతూనే ఉందని.. ఈ సారి కూడా గులాబీ జెండా ఎగరేస్తామన్నారు.

First Published:  10 April 2024 7:33 AM GMT
Next Story