Telugu Global
Telangana

జాతీయ స్థాయి పోటీ పరీక్షలు తెలుగులో.. కేసీఆర్ తపన ఫలితం ఇది

86శాతం మంది ఆ రెండు ప్రాంతాల (బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్)కు చెందినవారే ఉద్యోగాలు సాధించారు. మిగతా రాష్ట్రాలనుంచి కేవలం 14శాతం మందే ఎంపికయ్యారు.

జాతీయ స్థాయి పోటీ పరీక్షలు తెలుగులో.. కేసీఆర్ తపన ఫలితం ఇది
X

స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే గ్రూప్ బి, గ్రూప్ సి పోటీ పరీక్షలు ఇకపై ప్రాంతీయ భాషల్లోనూ జరుగుతాయని కేంద్రం ప్రకటించింది. అంటే క్వశ్చన్ పేపర్ గతంలో లాగా కేవలం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉండదు. తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా పేపర్ అందుబాటులోకి వస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు కచ్చితంగా ఇది మేలు చేసే అంశమే.

హిందీ, ఇంగ్లిష్ లో క్వశ్చన్ పేపర్ ఉంటే ఏమవుతుంది..?

జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎక్కువమంది ఉత్తరాదివారే సెలక్ట్ అవుతుంటారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్ తో పాటు హిందీలో కూడా ఉంటుంది కాబట్టి.. హిందీ వచ్చిన ఉత్తరాది అభ్యర్థులకు పరీక్ష రాయడం సులువవుతుంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు ప్రశ్నలు అర్థం చేసుకుని వాటికి జవాబులు గుర్తించే సరికి సమయం సరిపోతుంది.

ఇది కేవలం ఆరోపణ కాదు. అక్షర సత్యం. గత కొన్నేళ్లుగా లెక్కలు తీస్తే వాస్తవం బోధపడుతుంది. 2021-23లో స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించిన పరీక్షల్లో 18వేల పోస్ట్ లకు గాను.. 16560 పోస్ట్ లు కేవలం ఉత్తరాదివారే (నార్త్ రీజియన్ - NR) సొంతం చేసుకున్నారు. 5131 మంది సెంట్రల్ రీజియన్ (CR) వారు. అంటే 86శాతం మంది ఆ రెండు ప్రాంతాల (బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్)కు చెందినవారే ఉద్యోగాలు సాధించారు.

మిగతా రాష్ట్రాలనుంచి కేవలం 14శాతం మందే ఎంపికయ్యారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఒకటే. ఇంగ్లిష్ తోపాటు వారి స్థానిక భాష అయిన హిందీలో కూడా పరీక్ష పేపర్లు ఉండటంతో సులభంగా ఆ రెండు ప్రాంతాలవారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. దీనికి చెక్ పెట్టడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీశాట్ తరపున, స్టాఫ్ సెలక్షన్ కమిటీ(SSC) పరీక్షల్లో స్థానిక భాషకు కూడా గుర్తింపు ఇవ్వాలనే పోరాటం మొదలైంది. చివరకు కేంద్రం ఈ ప్రతిపాదనకు ఒప్పుకోక తప్పలేదు. SSC నిర్వహించే పరీక్షల్లో స్థానిక భాషల్లో కూడా ప్రశ్నాపత్రాలు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై SSC పరీక్షల్లో తెలుగు మాధ్యమంలో కూడా ప్రశ్నలు ఇస్తారు.

కేసీఆర్ కృషి ఫలితంగానే ఈ మార్పు సాధ్యమైనట్టు తెలిపారు టీశాట్ సీఈఓ శైలేష్ రెడ్డి. సీఎం కేసీఆర్ కోరుకున్న మార్పు ఇదేనని అన్నారాయన. పరీక్షలు హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటే ఏం జరుగుతుందో, ఎవరికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయో తెలిపే వివరాలను ఆయన ట్వీట్ చేశారు.

First Published:  23 Jan 2023 10:14 AM GMT
Next Story