Telugu Global
Telangana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఊరట.. కాంగ్రెస్ నాయకుడు నాగం పిటిషన్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

2019లో నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన మర్రి జనార్థన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డిపై 54,354 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఊరట.. కాంగ్రెస్ నాయకుడు నాగం పిటిషన్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
X

తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మర్రి జనార్థన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. 2019లో నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసిన మర్రి జనార్దన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డిపై 54,354 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో మర్రి జనార్దన్ రెడ్డి కొన్ని వివరాలు దాచి పెట్టారంటూ నాగం హైకోర్టులో పిటిషన్ వేశారు.

తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి మర్రి జనార్దన్ రెడ్డి గెలిచారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌లో కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. నాగం తగినన్ని ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. మర్రి జనార్దన్ రెడ్డి గెలుపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆయన అఫిడవిట్ సరైనదే అని పేర్కొన్నది.

కాగా, నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ కోర్టు కొట్టేయడంతో మర్రి జనార్దన్ రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుంచి తన అఫిడవిట్ సరైనదే అని కోర్టు ముందు చెప్పారు. అందుకు తగిన ఆధారాలను కూడా సమర్పించారు.

ఇటీవల కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరావును తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు రుజువు కావడంతో హైకోర్టు అతడిని అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

First Published:  14 Aug 2023 12:42 PM GMT
Next Story