Telugu Global
Telangana

రేపిస్టులకు బెయిల్ లభించకుండా చూడాలి.. మంత్రి కేటీఆర్

చట్టాల్లోని లొసుగుల వల్ల రేపిస్టులు బైటపడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఏ రేపిస్టుకూ బెయిల్ లభించకుండా చూడాల్సి ఉందన్నారు. బిల్కిస్ బానో కేసు నేరస్తులను యుద్ధ యోధులుగానో, స్వాతంత్య్ర సమర యోధులుగానో పరిగణిస్తూ వారికి పూలమాలలు వేసి స్వాగతం చెప్పడం మన దేశ ప్రతిష్ఠకే మచ్చ అని ఆయన ట్వీట్ చేశారు.

రేపిస్టులకు బెయిల్ లభించకుండా చూడాలి.. మంత్రి కేటీఆర్
X


బిల్కిస్ బానో కేసులో రేపిస్టుల విడుదలను రద్దు చేయాలని, ఇలాంటి నిందితులకు బెయిల్ రాకుండా చట్ట సవరణ చేయాలని కోరుతూ తాను చేసిన ట్వీట్ పై వచ్చిన ట్రోలింగ్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రేప్ కేసుకు సంబంధించి నిందితుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందని సిల్లీగా ట్రోల్ చేశారని, కానీ ఆ రేపిస్టులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపామని ఆయన తెలిపారు.

45 రోజుల జైలు శిక్ష అనంతరం వాళ్ళు హైకోర్టు ఉత్తర్వులతో బెయిల్ పై రిలీజయ్యారని ఆయన ట్వీట్ చేశారు. రేపిస్టులను చట్టప్రకారం శిక్షించాల్సిందే ! అయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐపీసీ వంటి చట్టాల్లోని లొసుగుల వల్ల ఇలాంటివారు బయటపడుతున్నారు..అందుకే చట్టసవరణలు చేయాలని కోరుతున్నామన్నారు. ఏమైనా.... రేపిస్టులకు శిక్ష పడేంతవరకూ పోరాడుతాం అని ఆయన పేర్కొన్నారు. ఏ రేపిస్టుకూ బెయిల్ లభించకుండా చూడాల్సి ఉందన్నారు. . అత్యాచార కేసుల్లో దోషిగా తేలినప్పుడు ఆ వ్యక్తి మరణించేంతవరకు జైల్లోనే ఉంచాలి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

బిల్కిస్ బానో కేసు నేరస్తులను యుద్ధ యోధులుగానో, స్వాతంత్య్ర సమర యోధులుగానో పరిగణిస్తూ వారికి పూలమాలలు వేసి స్వాగతం చెప్పడం మన దేశ ప్రతిష్ఠకే మచ్చ అని ఆయన ట్వీట్ చేశారు.

First Published:  19 Aug 2022 6:20 AM GMT
Next Story