Telugu Global
Telangana

తెలంగాణలో పోలింగ్ రోజు ర్యాపిడో బంపర్ ఆఫర్

హైదరాబాద్ లో ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లడం కొన్నిచోట్ల ఇబ్బందిగా ఉంటుంది. ఓటు వేయాలన్న ఉత్సాహం ఉన్నా.. కొందరికి ప్రయాణ వసతి లేక ఇంటిలోనే ఉండిపోతారు. ఈ దశలో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో.. హైదరాబాద్ ఓటర్లకోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తెలంగాణలో పోలింగ్ రోజు ర్యాపిడో బంపర్ ఆఫర్
X

ఈనెల 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం నుంచి ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ దశలో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో.. హైదరాబాద్ ఓటర్లకోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పోలింగ్ రోజు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు ర్యాపిడో అధినేతలు ప్రకటన విడుదల చేశారు.

హైదరాబాద్ లో ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లడం కొన్నిచోట్ల ఇబ్బందిగా ఉంటుంది. ఓటు వేయాలన్న ఉత్సాహం ఉన్నా.. కొందరికి ప్రయాణ వసతి లేక ఇంటిలోనే ఉండిపోతారు. అలాంటి వారు ర్యాపిడో సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది ఆ సంస్థ యాజమాన్యం. ర్యాపిడో ట్యాక్సీలు ఓటర్లకోసం పోలింగ్ రోజు అందుబాటులో ఉంటాయని, వారి నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని చెప్పింది.

మునుపటికంటే తెలంగాణలో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అంటోంది. ఈ దశలో ప్రతి ఓటూ కీలకంగా మారింది. ముఖ్యంగా యువ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు వచ్చినవారు ఏవైపు ఉంటారనేది రాజకీయ పార్టీలకు కీలకం. రాజకీయ నేతలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు కూడా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ ఫ్రీ రైడ్ అంటూ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ నగరంలోని మొత్తం 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా చేరవేస్తామని ర్యాపిడో సంస్థ తెలిపింది. నగరంలో ఎక్కడి నుంచైనా పోలింగ్ బూత్ కు ఉచితంగా వెళ్లేందుకు తమ సంస్థ సహాయం చేస్తుందన్నారు ర్యాపిడో నిర్వాహకులు. ఉచిత ప్రయాణ ఆఫర్ ముఖ్యంగా యువ ఓటర్లను పోలింగ్ స్టేషన్‌ లకు ఆకర్షించడంలో ఉపయోగకరంగా ఉంటుందని వారు భావిస్తున్నారు.

First Published:  28 Nov 2023 5:31 AM GMT
Next Story