Telugu Global
Telangana

బాహుబలి రేవంత్.. రామ్ గోపాల్ వర్మ వెరైటీ అభినందన

రేవంత్ రెడ్డి లాంటి సింహానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వడం సరైన నిర్ణయం అని అప్పట్లో ట్వీట్ వేశారు వర్మ. సింహం రాకతో పులులన్నీ భయపడి పక్కకు తప్పుకుంటాయని కూడా ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్ నిజమైందని గుర్తు చేస్తున్నారు వర్మ.

బాహుబలి రేవంత్.. రామ్ గోపాల్ వర్మ వెరైటీ అభినందన
X

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డితో తనకు పాత పరిచయం ఉందని గుర్తు చేస్తూ.. ఆయనతో దిగిన ఫొటోని అప్ లోడ్ చేస్తూ ట్వీట్ వేశారు వర్మ. వారియర్ కింగ్ రేవంత్ రెడ్డి అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. అంతే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనంటూ కితాబిచ్చారు వర్మ.


చాన్నాళ్ల తర్వాత తనకు కాంగ్రెస్ పార్టీపై గౌరవం పెరిగిందని, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం అవుతున్నారని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా తన ట్వీట్ లో మెన్షన్ చేశారాయన. ఇతర రాష్ట్రాల్లో ఓడిపోయిన కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం గెలవగలిగింది అంటే దానికి కారణం కేవలం రేవంత్ రెడ్డేనని చెప్పారు వర్మ. రేవంత్ రెడ్డి లాంటి బాహుబలి ఉండటంతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని, ఇలాంటి నాయకుల్ని అధిష్టానం గుర్తుంచుకోవాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదని, రేవంత్ రెడ్డి గెలిచారని ప్రశంసల వర్షం కురిపించారు.

నేనెప్పుడో చెప్పా..!

తెలంగాణలో కాంగ్రెస్ విజయం తర్వాత రేవంత్ రెడ్డి మరో ఆసక్తికర ట్వీట్ వేశారు. 2021 జూన్ 26న తన ట్వీట్ ని ఆయన మరోసారి స్క్రీన్ షాట్ రూపంలో తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై అప్పట్లో వర్మ ట్వీట్ వేశారు. రేవంత్ రెడ్డి లాంటి సింహానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధ్యక్ష పదవి ఇవ్వడం సరైన నిర్ణయం అని అప్పట్లో ట్వీట్ వేశారు వర్మ. సింహం రాకతో పులులన్నీ భయపడి పక్కకు తప్పుకుంటాయని కూడా ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ ట్వీట్ నిజమైందని గుర్తు చేస్తున్నారు వర్మ.

First Published:  3 Dec 2023 1:02 PM GMT
Next Story