Telugu Global
Telangana

రామ్ చరణ్ కుమార్తెకు నామకరణం.. పేరేంటంటే..?

ఈరోజు మనవరాలికి పేరు పెట్టిన చిరంజీవి ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

రామ్ చరణ్ కుమార్తెకు నామకరణం.. పేరేంటంటే..?
X

మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, రామ్ చరణ్ కుమార్తెకు ఈరోజు బారసాల కార్యక్రమం జరిగింది. చిన్నారి పాపను ఊయలలో వేసి కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. కొణిదెల నివాసంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. తాతలిద్దరూ మనవరాలిని ఊయలలో ఊపుతున్న ఫొటోని అభిమానులకోసం విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో ఆమెకు పేరు పెట్టారు. రామ్ చరణ్ కుమార్తెకు 'క్లిన్ కారా' అని నామకరణం చేశారు.


KKK

పాప పేరు ‘క్లిన్(K) కారా(K) కొణిదెల(K)’ అంటే KKK అన్నమాట. క్లిన్ కారా అనే పేరు మోడ్రన్ గా ఉన్నా ఆ పేరుని లలితా సహస్రనామం నుండి తీసుకున్నామని చెప్పారు చిరంజీవి. 'క్లిన్ కార' ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందని, దివ్యమైన తల్లి 'శక్తి' యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుందని, ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉందని తెలిపారు చిరంజీవి. తన మనవరాలు ఎదిగే కొద్దీ ఆమె పేరులో ఉన్న లక్షణాలు ఆమె వ్యక్తిత్వంలో ఇనుమడిస్తాయని ఆకాంక్షించారు చిరంజీవి.

జూన్ 20వ తేదీన రామ్ చరణ్ భార్య ఉపాసన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. మెగా ప్యామిలీలో మెగా ప్రిన్సెస్ పుట్టిందని అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఈరోజు మనవరాలికి పేరు పెట్టిన చిరంజీవి ఆ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

First Published:  30 Jun 2023 11:27 AM GMT
Next Story