Telugu Global
Telangana

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని, ఏ పార్టీ కూడా తనను ఈ విషయంలో సంప్రదించలేదని చెప్పారు.

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
X

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టతను ఇచ్చారు. రాహుల్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ బరిలోకి దిగడం ఖాయమనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారాలకు రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టాడు.

తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని, ఏ పార్టీ కూడా తనను ఈ విషయంలో సంప్రదించలేదని చెప్పారు. రాహుల్ సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. 'అందరికీ హాయ్. నేనొక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు ఇటీవల చాలా రూమర్స్ వస్తున్నాయి. మీడియాలో ప్రచారం అవుతున్నది. అదంతా ఫేక్ న్యూస్. ఎన్నికల బరిలోకి దిగడం అవాస్తవం.' అని చెప్పారు.

'నాకు అన్ని పార్టీల లీడర్లంటే గౌరవం ఉన్నది. నేను ఒక ఆర్టిస్టును. కాబట్టి అందరినీ ఎంటర్‌టైన్ చేయడం నా బాధ్యత. నా జీవితాంతం ఇలా అందరికీ వినోదాన్ని అందిస్తుంటాను. కానీ ఈ వార్తను ఎందుకు ప్రచారంలో పెట్టారో నాకు మాత్రం అర్థం కావడం లేదు. న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇలా ప్రచారం చేస్తున్నాయి. నేను సంగీతాన్ని నా కెరీర్‌గా ఎంచుకున్నాను. మ్యూజిక్ ఇండస్ట్రీకి నేను చేయాల్సింది చాలా ఉన్నది. నన్ను ఏ పొలిటికల్ పార్టీ కూడా సంప్రదించలేదు. అలాగే నేను కూడా ఏ రాజకీయ పార్టీని అడగలేదు. ఇలాంటి ఫేక్ వార్తలను దయచేసి స్ప్రెడ్ చేయవద్దు. మీ సపోర్ట్ ఎప్పుడూ కావాలి' అంటూ రాహుల్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ఓల్డ్ సిటీకి చెందిన రాహుల్ సిప్లిగంజ్‌కు మాస్‌లో చాలా పాలోయింగ్ ఉన్నది. రాహుల్ పాడిన పాటలు యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయ్యాయి. బిగ్ బాష్ షోను గెలవడం ద్వారా మరింతగా పాపులర్ అయ్యాడు. ఇక ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడటం విశేషం. అంతే కాకుండా అవార్డుల ఫంక్షన్ రోజు ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడటం ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఈ క్రమంలో రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని.. టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రాహుల్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.





First Published:  26 Aug 2023 2:51 PM GMT
Next Story