Telugu Global
Telangana

మల్లారెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..!

ఈ భూమి తమదే అని అవతలి వర్గం వాదిస్తోంది. 15 మందిమి కలిసి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామంటోంది. కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వచ్చిందని చెబుతున్నారు.

మల్లారెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..!
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపుర్‌లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశార‌ని మ‌ల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. స్థ‌లం చుట్టూ బారికేడ్లు, ఫెన్సింగ్ వేశారు. ఇది తెలుసుకున్న మల్లారెడ్డి తన అల్లుడ్ని, అనుచరుల్ని తీసుకుని ఘ‌ట‌నా స్థ‌లానికి వద్దకు చేరుకున్నారు. బారికేడ్లు, ఫెన్సింగ్‌ను తొలగించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఫెన్సింగ్ వేసిన స్థ‌లం మ‌ల్లారెడ్డిది కాద‌ని కోర్టు తీర్పు చెప్పిన‌ప్ప‌టికీ దాన్ని తిరిగి ఆక్ర‌మించాల‌ని చూడడం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని పోలీసులు వారించారు. అయినా మ‌ల్లారెడ్డి విన‌కుండా ఘర్షణకు దిగారంటూ పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందన్నారు మల్లారెడ్డి. 40ఏళ్లుగా భూమి తన పేరు మీదే ఉందన్నారు. తన భూమిని కబ్జా చేసిన వాళ్లకు పోలీసులు రక్షణగా ఉన్నారని ఆరోపించారు. కేసులు పెడితే పెట్టుకోండని తన భూమిని కాపాడుకుంటానన్నారు. ఈ భూమి తమదే అని అవతలి వర్గం వాదిస్తోంది. 15 మందిమి కలిసి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామంటోంది. కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వచ్చిందని చెబుతున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందు వల్ల సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

First Published:  18 May 2024 7:41 AM GMT
Next Story