Telugu Global
Telangana

జూనియ‌ర్ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో 'పుష్ప' నటుడి అరెస్ట్

ఫొటోలు బయటికి వస్తే పరువు పోతుందని మనస్తాపానికి గురైన ఆ మహిళ గ‌త నెల 29వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

జూనియ‌ర్ ఆర్టిస్టు ఆత్మహత్య కేసులో పుష్ప నటుడి అరెస్ట్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరో సహచరుడిగా `కేశ‌వ` పాత్ర‌లో నటించిన బండారు జగదీష్.. మహిళ ఆత్మహత్య కేసులో అరెస్టు అయ్యాడు. సినీ రంగానికి చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ తన గదిలో మరొక వ్యక్తితో ఉండగా జగదీష్ ఫొటోలు తీసి ఆమెను బెదిరించాడు. మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జగదీష్‌ను ఇవాళ పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

పంజగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేస్తోంది. ఆమెతో జగదీష్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. గత నెల 27న ఆమె ఓ వ్యక్తితో గదిలో ఉండగా.. ఆమెకు తెలియకుండా ఫొటోలు తీసి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ మహిళను బెదిరించాడు.

ఫొటోలు బయటికి వస్తే పరువు పోతుందని మనస్తాపానికి గురైన ఆ మహిళ గ‌త నెల 29వ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జగదీష్ బెదిరింపులతోనే జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న జగదీష్‌ను ఎట్ట‌కేల‌కు ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

First Published:  6 Dec 2023 12:55 PM GMT
Next Story