Telugu Global
Telangana

పుష్ప-2 టీజర్‌..తెలంగాణ అమ్రాబాద్‌ ఫారెస్ట్‌లో రిపీట్

ఐతే ఇప్పుడు తెలంగాణలోని నల్లమల అమ్రాబాద్ ఫారెస్టులో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. సేమ్ పుష్పలాగే అడవిలో పార్టీ చేసుకుంటూ నలుగురు వేటగాళ్లు ట్రాప్ కెమెరాలకు దొరికిపోయారు.

పుష్ప-2 టీజర్‌..తెలంగాణ అమ్రాబాద్‌ ఫారెస్ట్‌లో రిపీట్
X

పుష్ప-2 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. పుష్ఫ కనిపించకపోవడంతో ఏమయ్యాడోనని తెగ టెన్షన్ పడుతుంటారు జనం. ఐతే ఇంతలోనే అడవిలో పెట్టిన ట్రాప్ కెమెరాలకు పుష్ప చిక్కుతాడు. ఈ టీజర్‌లో పులి కూడా పుష్పను చూసి భయపడి వెనకడుగు వేస్తుంది.

ఐతే ఇప్పుడు తెలంగాణలోని నల్లమల అమ్రాబాద్ ఫారెస్టులో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. సేమ్ పుష్పలాగే అడవిలో పార్టీ చేసుకుంటూ నలుగురు వేటగాళ్లు ట్రాప్ కెమెరాలకు దొరికిపోయారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని పాండిగుండం పరిధిలోని దట్టమైన ఉమ్మన్ పెంట బీట్‌లో అటవీ అధికారులు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి 23న, కెమెరా డేటాను అటవీ సిబ్బంది పరిశీలించినప్పుడు..ఫిబ్రవరి 2, 2024న, కెమెరా ట్రాప్ ఫేజ్ 4లో భాగంగా నలుగురు వేటగాళ్లను గుర్తించారు. ఇద్దరు వేటగాళ్లు నీల్గాయ్‌ను వేటాడి పట్టుకెళ్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. మొత్తం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. అతనికోసం గాలిస్తున్నామన్నారు.

First Published:  26 Feb 2024 6:24 AM GMT
Next Story