Telugu Global
Telangana

తెలంగాణ నీటిపారుదల వ్యవస్థను చూసి చాలా నేర్చుకున్నా, పంజాబ్‌లో అమలు చేస్తా - పంజాబ్ సీఎం

గురువారం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా మన్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) చేపట్టి నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.

తెలంగాణ నీటిపారుదల వ్యవస్థను చూసి చాలా నేర్చుకున్నా, పంజాబ్‌లో అమలు చేస్తా - పంజాబ్ సీఎం
X

రెండు రోజుల తెలంగాణ‌ పర్యటనలో ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, నదీజలాలను సమర్ధవంతంగా ఉపయోగించుకునే తెలంగాణ కాలువ ఆధారిత నీటిపారుదల వ్యవస్థను పంజాబ్‌లో పుఏర్పాటు చేస్తామని అన్నారు.

గురువారం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా మన్ విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (కేఎల్‌ఐఎస్) చేపట్టి నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.

పంజాబ్‌లో కాలువ నీటిని చానలైజ్ చేయడం ప్రస్తుత ఆవశ్యకమని పేర్కొన్న ఆయన, తెలంగాణ మోడల్‌ను పరిశీలించడం ద్వారా భూగర్భజలాలను పెంచడం ఎలా అన్నది తెలంగాణను చూసి నేర్చుకోవాలన్నారు. తన పర్యటనలో వేగంగా క్షీణిస్తున్న భూగర్భజలాలను ఆదా చేసే సాంకేతికతలను పరిశీలించిన మన్, ఒకవైపు నీటిని ఆదా చేస్తూనే మరోవైపు భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు తెలంగాణ అనుసరిస్తున్న మార్గాన్ని కొనియాడారు.

పంజాబ్‌లో భూగర్భ జలాల అతి వాడకం వల్ల‌ , నీటిమట్టం వేగంగా క్షీణిస్తోందని విచారం వ్యక్తం చేసిన ఆన్ పంజాబ్‌లోని 150 బ్లాకుల్లో 78 శాతానికి పైగా భూగర్భజలాలు పూర్తిగా క్షీణించడం తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.

అంతకుముందు మర్కూక్‌లో కేఎల్‌ఐఎస్‌లో భాగంగా నిర్మించిన కొండ పోచమ్మ సాగర్‌ను సందర్శించారు మాన్. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ గురించి స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ (ఇరిగేషన్) రజత్ కుమార్ మాన్ కు వివరించారు. మర్కూక్‌లోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కుడవెల్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను, మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసిన పాండవుల చెరువును ఆయన సందర్శించారు.

పాండవుల చెరువు వద్ద రైతులతో కలిసిన మాన్ తెలంగాణ‌ ఏర్పడిన తర్వాత వారి జీవితాలు ఎలా మారాయని అడిగి తెలుసుకున్నారు. సాగునీరు అందడంతో తమ ఆదాయం బాగా పెరిగిందని రైతులు బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అనేక రిజర్వాయర్లను నిర్మించడంతో భూగర్భజలాలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయని వారు ఆయనకు చెప్పారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని ఇతర చోట్ల రైతులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారని, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక రైతులు నిత్యం జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టాల్సి వస్తున్నదని మాన్ అన్నారు.

First Published:  16 Feb 2023 4:19 PM GMT
Next Story