Telugu Global
Telangana

మల్లారెడ్డి కాలేజీ ముందు ధర్నా.. మైనంపల్లి ఆధ్వర్యంలో హై డ్రామా

మల్లారెడ్డి కాలేజీ వ్యవహారం మరోసారి తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విద్యార్థుల ఆందోళనకు మైనంపల్లి హన్మంతరావు మద్దతు తెలిపారు.

మల్లారెడ్డి కాలేజీ ముందు ధర్నా.. మైనంపల్లి ఆధ్వర్యంలో హై డ్రామా
X

కాలేజీకి వెళ్లకుండా డుమ్మా కొట్టినా, బ్యాక్ లాగ్ లు ఉన్నా.. విద్యార్థుల్ని డిటెయిన్ చేస్తుంటాయి యాజమాన్యాలు. అదే తరగతి మళ్లీ చదవాలని చెబుతాయి. ఇలాంటి సందర్భంలో యాజమాన్యాల చర్య సరైనదా కాదా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ ముందు విద్యార్థులు రచ్చ రచ్చ చేయడం సంచలనంగా మారింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. 22 మంది విద్యార్థులను అన్యాయంగా డిటెయిన్ చేశారని ఆరోపిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. వారికి కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలవడంతో ఈ గొడవ రాజకీయ రంగు పులుముకుంది.


తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రతి రోజూ మల్లారెడ్డి కాలేజీలు వార్తల్లో నిలుస్తున్నాయి. అక్రమ కట్టడాలంటూ స్థానిక అధికారులు కాలేజీ బిల్డింగ్ లు పడగొడుతున్నారు. అటు మల్లారెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. తాజాగా అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఫర్నిచర్ ధ్వంసం చేశారు, మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. డిటెయిన్ చేశారనేది ప్రధాన ఆరోపణ కాగా, విద్యార్థులకు కాంగ్రెస్ సపోర్ట్ తర్వాత మరిన్ని విషయాలు హైలైట్ అవుతున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మైనంపల్లి ఎంట్రీ..

కొంతకాలంగా మైనంపల్లి, మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు పేలడం చూస్తూనే ఉన్నాం. ఇద్దరిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడంలేదు. తాజాగా మల్లారెడ్డి కాలేజీ వ్యవహారం మరోసారి తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విద్యార్థుల ఆందోళనకు మైనంపల్లి హన్మంతరావు మద్దతు తెలిపారు.మల్లారెడ్డి కాలేజీ వ్యవహారం మరోసారి తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.

First Published:  18 March 2024 6:59 AM GMT
Next Story