Telugu Global
Telangana

ఈ రోజే కొత్త చరిత్రకు శ్రీకారం.. మద్దతుపలికేందుకు వచ్చిన ప్రముఖ నాయకులు

ఈ రోజు టీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రకటించబోతున్న నూతన జాతీయ పార్టీకి తమ మద్దతు పలకడానికి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి, తమిళ నాడు నుంచి 'విదుతాలై చిరుతైగల్ కట్చె' (విసికె)పార్టీ అధినేత, పార్లమెంట్ సభ్యుడు,త తిరుమావళవన్హైదరాబాద్ చేరుకున్నారు. వారికి ప్రగతి భవన్ లో కేసీఆర్ ఘన స్వాగతం పలికారు

ఈ రోజే కొత్త చరిత్రకు శ్రీకారం.. మద్దతుపలికేందుకు వచ్చిన ప్రముఖ నాయకులు
X

ఈ రోజు దేశంలో ఓ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు హైదరాబాద్ వేదిక కాబోతోంది. 2001 లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, 2014 లో తెలంగాణ రాష్ట్ర సాధనతో తెలంగాణ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన కేసీఆర్.... ఆ తర్వాత రెండు పర్యాయాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని, ఎవరూ ఎన్నడూ ఊహించని ప్రజా సంక్షేమ పథకాలతో , అద్భుతమైన అభివృద్దితో తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్..... ఇంతకన్నా గొప్ప‌ అభివృద్ది, అద్భుత‌ పాలన, రైతు రాజ్యం తదితర లక్ష్యాలతో జాతీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. భారత దేశంలో ఈ రోజు ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఇవ్వాళ్ళ పురుడు పోసుకోనుంది.

ఈ రోజు కేసీఆర్ ప్రకటించబోతున్న జాతీయ పార్టీకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మద్దతు వస్తున్నది. కొన్ని రాజకీయ పార్టీలు, రైతుసంఘాలు, సంస్థలు ...ఇలా అనేక వర్గాలు కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న జాతీయ పార్టీకోసం ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీని స్వాగతించేందుకు సిద్దంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ ప్రకటన కార్యక్రమంలో పాల్గొని ఆ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తమిళ నాడు నుంచి 'విదుతాలై చిరుతైగల్ కట్చె' (విసికె)పార్టీ అధినేత, చిదంబరం పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్, ఆ పార్టీ ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ నాయకులంతా కేసీఆర్ ను కలవడానికి ప్రగతిభవన్ కు వచ్చారు. వీరిని ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్, మంత్రి , టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ లు సాదరంగా ఆహ్వానించారు. వీరిని ఆహ్వనించిన వారిలో కేసీఆర్, కేటీఆర్ లతో పాటు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్., టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు., ఎమ్మెల్సీలు., తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు.



First Published:  5 Oct 2022 6:53 AM GMT
Next Story