Telugu Global
Telangana

ప్రీతి కేసు: రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని అబద్దాలా ? నెటిజనులకు అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్

ప్రీతి చావుబతుకులతో ఆస్పత్రిలో పోరాడుతూ ఉంటే... ఆమెపై, ఆమె కుటుంబంపై కనీస సానుభూతి లేని బండిసంజయ్ ఆమె చనిపోయిందని ప్రకటించేశారు. పైగా ఈ సంఘటన లవ్ జీహాదీ అని తేల్చేశారు.

ప్రీతి కేసు: రాజకీయ ప్రయోజనాల కోసం ఇన్ని అబద్దాలా ? నెటిజనులకు అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్
X

ప్రతి దాంట్లో రాజకీయ ప్రయోజనాలు ఆశించడం రాజకీయనాయకులకు పరిపాటే. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అదే పని చేశాడని సోషల్ మీడియాలో నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతి సంఘటన‌లోనూ మతాన్ని తీసుకరావడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం...దానికి అబద్దాలను ఆధారం చేసుకోవడం, బతికున్నవాళ్ళను చంపేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వరంగల్ మెడికల్ విద్యార్థి ప్రీతి ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను వేధించిన, అవమానించిన‌ సైఫ్ అనే ప్రీతి సీనియర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై కేసులు నమోదు చేశారు.

ఈ సంఘటన లో ప్రేమ వ్యవహారంలేదు.... లైంగిక వేధింపులు లేవు... స్త్రీ అని, గిరిజన అమ్మాయి అనే చిన్నచూపు ఉంది.... బాసిజం ఉంది....ఈ విషయాలు పోలీసులు తమ విచారణలో తేల్చారు. సైఫ్ చేసిన వాట్సప్ ఛాట్ లతో ఈ విషయం తేలింది.

ఇంతస్పష్టంగా కేసు కనపడుతూ ఉంటే....ప్రీతి చావుబతుకులతో ఆస్పత్రిలో పోరాడుతూ ఉంటే... ఆమెపై, ఆమె కుటుంబంపై కనీస సానుభూతి లేని బండిసంజయ్ ఆమె చనిపోయిందని ప్రకటించేశారు. పైగా ఈ సంఘటన లవ్ జీహాదీ అని తేల్చేశారు.

బండి సంజయ్ మాట్లాడుతూ, ''ప్రీతి చనిపోయినందు వల్ల ఆ కుటుంబం బాధపడుతోంది. ఇది వంద శాతం లవ్ జిహాద్ కేసే, తెలంగాణలో ఇలాంటి కేసులు అడ్డగోలుగా మొదలయ్యాయి, హిందూ మతానికి సంబంధించిన అమ్మాయిలను వేధిస్తున్నారు. మాయ మాటలతో అమ్మాయిలను మోసం చేస్తున్నారని అనేక రోజులుగా బీజేపీ (BJP) చెబుతోంది, ఇలాంటి కార్యక్రమాలకు ఇతర దేశాల నుంచి నిధులు వస్తున్నాయి.'' అని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని ఆయన‌ మండిపడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి చనిపోయిందని చెప్పడమే కాక, ప్రేమ వ్యవహారమే లేని ఈ కేసును లవ్ జీహాదీ అని మాట్లాడటం ఏ రకమైన రాజకీయం అని నెటిజనులు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ప్రీతి సంఘటనపై మీడియాలో ఎప్పటికప్పుడు న్యూస్ వస్తున్నప్పటికీ ఇంత అవగాహన లేకుండా మాట్లాడటం ఏంటని నెటిజనులు బండి సంజయ్ ని ప్రశ్నిస్తున్నారు.

''అబద్దాలైనా సరే మాట్లాడండి ఎదుటి పక్షంపై దాడులు చేయండి'' అని గతంలో బీజెపి అగ్రనేత అమిత్ షా మాట్లాడిన మాటల‌ను ఈ సందర్భంగా నెటిజనులు గుర్తు చేస్తున్నారు. బాస్ బాటలో శిష్యుడు నడుస్తున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

First Published:  24 Feb 2023 3:41 PM GMT
Next Story