Telugu Global
Telangana

షిండే గ్రూప్ నుంచి బీఆర్ఎస్ లోకి కీలక నేత

నాగపూర్ కి సంబంధించి శివసేనలో కీలకంగా పనిచేసిన ప్రవీణ్ షిండే, ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో చేరారు. ఆయన సారథ్యంలో సౌత్ వెస్ట్ నాగపూర్ నాయకగణం సామూహికంగా గులాబీ కండువాలు కప్పుకుంది.

షిండే గ్రూప్ నుంచి బీఆర్ఎస్ లోకి కీలక నేత
X

మహారాష్ట్రలో బీఆర్ఎస్ అడుగులు బలంగా పడుతున్నాయి. చేరికలతో గులాబి పార్టీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో బోణీ కొట్టిన బీఆర్ఎస్, శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని మహారాష్ట్రపై మరింత ఫోకస్ పెట్టింది. తాజాగా సీఎం షిండే గ్రూప్ కి చెందిన కీలక నేత బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ వచ్చిన ప్రవీణ్ షిండేకు సీఎం కేసీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ప్రవీణ్ షిండేతోపాటు మరికొంతమంది నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

మహారాష్ట్రలోని సౌత్‌ వెస్ట్ నాగపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్‌ షిండే. ఈ నియోజకవర్గానికి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ, షిండే గ్రూప్ పొత్తులోనే ఉన్నా.. ఇక్కడ ప్రవీణ్ షిండే చేరిక బీజేపీకి గుబులు పుట్టిస్తోంది. అటు షిండే సేన, ఇటు బీజేపీ.. రెండు పార్టీలకు ఈ చేరిక షాకిచ్చిందనే చెప్పాలి.

సౌత్‌ వెస్ట్‌ నాగపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ప్రవీణ్ షిండేకి మంచి పట్టు ఉంది. నాగపూర్ కి సంబంధించి శివసేనలో కీలకంగా పనిచేసిన ప్రవీణ్ షిండే, ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే గ్రూప్ లో చేరారు. బీజేపీతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన సారథ్యంలో సౌత్ వెస్ట్ నాగపూర్ నాయకగణం సామూహికంగా గులాబీ కండువాలు కప్పుకుంది. ధవలయన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, పద్మశాలి యువసేన నాయకులు, బీజేపీ ఓబీసీ సెల్‌ నాయకులు కూడా బీఆర్ఎస్ లో చేరారు. వారంతా సీఎం కేసీఆర్ ని మహారాష్ట్ర సంప్రదాయ పద్దతిలో గొంగడితో సన్మానించారు. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు కేసీఆర్.

First Published:  27 May 2023 4:06 AM GMT
Next Story