Telugu Global
Telangana

ఉత్కంఠకు తెర.. ప్రణీత్ హనుమంతు అరెస్ట్

ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా ప్రణీత్‌ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. అతని స్నేహితులు ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉత్కంఠకు తెర.. ప్రణీత్ హనుమంతు అరెస్ట్
X

ఉత్కంఠకు తెరపడింది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుని పోలీసులు అరెస్ట్ చేశారు. తన పలుకుబడి ఉపయోగించుకుని తప్పించుకుంటాడేమోనని సామాన్య జనం అనుమాన పడినా, పోలీసులు ప్రణీత్ ని అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో ప్రణీత్ ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడే కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా ప్రణీత్‌ హనుమంతును హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. ప్రణీత్‌తో పాటు అతని స్నేహితులలో మరో ముగ్గుర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వ్యక్తి ప్రణీత్ హనుమంతు. తండ్రి ఓ ఐఏఎస్ ఆఫీసర్. అయితే ప్రణీత్ మాత్రం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. సినిమాల ప్రమోషన్లలో కూడా పాల్గొనేవాడు. మొరటు హాస్యం, వెకిలి జోకులకు ప్రణీత్ పెట్టింది పేరు. ఇది కాస్తా ఇటీవల శృతి మించింది. సోషల్ మీడియాలో తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ వెకిలి చర్చలు పెట్టిన ప్రణీత్ హనుమంతు వీడియో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంలో సెలబ్రిటీలు కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఆ చర్చల్లో పాల్గొన్నవారందర్నీ కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పోస్టింగ్ తో ఈ వ్యవహారం మరింత వైరల్ గా మారింది. సాయి ధరమ్ తేజ్ పోస్టింగ్ కి చాలామంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మద్దతు పలికారు. ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రణీత్ హనుమంతు సోషల్ మీడియా కీచకుడంటూ చీవాట్లు పెట్టారు నెటిజన్లు. ప్రణీత్ వ్యవహారంతో ఈ తరహా వీడియో చర్చలు హైలైట్ అయ్యాయి. అలాంటి చర్చల్లో పాల్గొనేవారు తాము చూసే వీడియోలు, ఫొటోల గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారని తేలింది. అయితే ఈ చర్చలు బయటకు రావడంతో వారి వ్యవహారం కూడా బయటపడింది. ప్రణీత్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణ చెప్పాడు. మరి ప్రణీత్ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

First Published:  10 July 2024 11:40 AM GMT
Next Story