Telugu Global
Telangana

రోడ్ల‌పై దరఖాస్తులు.. బీ కేర్‌ ఫుల్‌ అంటూ KTR వార్నింగ్‌

తెలంగాణ ప్రజలకు సైతం పలు సూచనలు చేశారు కేటీఆర్. ఇల్లు, పింఛను లేదా ఆరు గ్యారంటీలలో ఏదైనా ఇప్పిస్తామని కాల్ చేస్తే OTPలు, ఇతర బ్యాంకు వివరాలు షేర్ చేయోద్దని సూచించారు.

రోడ్ల‌పై దరఖాస్తులు.. బీ కేర్‌ ఫుల్‌ అంటూ KTR వార్నింగ్‌
X

`ప్రజాపాలన`లో స్వీకరించిన దరఖాస్తులు రోడ్లపై కనిపించిన ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజాపాలన దరఖాస్తులను ప్రైవేట్ వ్యక్తులు నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేస్తున్న వీడియోలను సోషల్‌మీడియాలో చూస్తున్నానంటూ ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. ఈ దరఖాస్తుల్లో కోట్లాది మంది తెలంగాణ ప్రజల సున్నితమైన డేటా ఉందన్నారు. సున్నితమైన డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


తెలంగాణ ప్రజలకు సైతం పలు సూచనలు చేశారు కేటీఆర్. ఇల్లు, పింఛను లేదా ఆరు గ్యారంటీలలో ఏదైనా ఇప్పిస్తామని కాల్ చేస్తే OTPలు, ఇతర బ్యాంకు వివరాలు షేర్ చేయోద్దని సూచించారు. ఇక సైబర్‌ నేరగాళ్లు కాల్‌ చేసి ఏమైనా ఇళ్లు కట్టిస్తామంటున్నారా అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్‌ను తప్పు పడుతూ సెటైర్ వేశారు కేటీఆర్. భట్టి విక్రమార్క మాటలు నమ్మి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

బీఆర్ఎస్‌కు ఓటు వేసినా, లేకున్నా సైబర్ క్రైమ్ చట్టాన్ని రూపొందించడంలో భాగమైన వ్యక్తిగా తాను చెప్తున్నానని.. తన సూచనలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు కేటీఆర్‌. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దంటూ ప్రజలను హెచ్చరించారు. GHMC పరిధిలో పలు చోట్ల ప్రజాపాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించడం, ప్రైవేట్ వ్యక్తులు వాటిని ఇంటికి తీసుకెళ్తుండడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనలపై వెంటనే స్పందించిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేసింది.

First Published:  9 Jan 2024 1:58 PM GMT
Next Story